తుపాకులు, గునపాలు సిద్ధం చేసుకోండి – బీజేపీ ఎమ్మెల్యే పిలుపు

దేశంలో బీజేపీ నాయకుల రెచ్చగొట్టే, విద్వేషపు ఉపన్యాసాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. మహ్మద్ ప్రవక్త పై బీజేపీ నాయకులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ల వివాదాస్పద మాటలు, ప్రపంచవ్యాప్తంగా నిరసనలు మర్చిపోకముందే.. బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రజలను రెచ్చగొడుతూ మాట్లాడారు. పక్కనున్న వాళ్ళు ఆపినా ఆగకుండా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ శనివారం జన్సత్ తహసీల్ ఏరియాలోని వాజిద్‌పూర్ కావలి […]

Advertisement
Update:2022-07-11 11:20 IST

దేశంలో బీజేపీ నాయకుల రెచ్చగొట్టే, విద్వేషపు ఉపన్యాసాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. మహ్మద్ ప్రవక్త పై బీజేపీ నాయకులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ల వివాదాస్పద మాటలు, ప్రపంచవ్యాప్తంగా నిరసనలు మర్చిపోకముందే.. బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రజలను రెచ్చగొడుతూ మాట్లాడారు. పక్కనున్న వాళ్ళు ఆపినా ఆగకుండా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ శనివారం జన్సత్ తహసీల్ ఏరియాలోని వాజిద్‌పూర్ కావలి గ్రామంలో ఓ సభలో మాట్లాడుతూ..

”మీ షాపుల్లో ఓ రెండు పిస్తోళ్ళు, 4, 5 గునపాలు, ఒకటి రెండు పెట్టెల రాళ్లు సిద్దంగా పెట్టుకోండి అల్లర్లు జరిగినప్పుడు పోలీసులు వచ్చే దాకా ఆగకండి.” అని పిలుపునిచ్చారు. “పోలీసులు మాత్రం ఎంతకాలం పని చేస్తారు? పోలీసులు వచ్చేసరికి మీ షాపులకు నిప్పు పెడితే ఎలా” అని అన్నాడు సైనీ.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందినందుకు కేంద్ర సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్, బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ, వేదికపై నుండి గ్రామస్తులను ఉద్దేశించి ఈ విధమైన‌ వివాదాస్పద ప్రసంగాన్ని చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వేదికపై ఉన్న కొందరు నాయకులు ఆయనను ఆపే ప్రయత్నం చేయగా, విక్రమ్ సైనీ, “ఈరోజు నన్ను మాట్లాడనివ్వండి. నేను మాట్లాడేది న్యూస్‌పేపర్లలో రాసుకోమనండి. టీవీల్లో చూపించుకోమనండి. 5 సంవత్సరాల వరకు నన్ను ఎవరూ తొలగించలేరు, నాకు అంతకు మించి కోరిక లేదు.” అన్నాడు.

ఇక నుపుర్ శర్మ వ్యాఖ్యలపై, ఉదయ్ పూర్ టైలర్ హత్య గురించి విక్రమ్ సైనీ మాట్లాడుతూ.. నుపుర్ శర్మ అలా మాట్లాడడం ఆమె ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. ‘‘హిందూ దేవతలకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చా?.. వారికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం తల నరికేస్తారా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News