రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తా: ఈటల రాజేందర్

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. తన ప్రస్థానం ప్రారంభమైంది గజ్వేల్ నుంచే అని.. తిరిగి అక్కడికే తాను చేరుకుంటానని ఈటల అన్నారు. కొద్ది రోజుల్లో బీజేపీలోకి భారీ చేరికలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ నడుస్తోందని, సీక్రెట్ ఆపరేషన్ కూడా చేస్తున్నట్లు ఈటెల వెల్లడించారు. […]

Advertisement
Update:2022-07-09 11:50 IST

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. తన ప్రస్థానం ప్రారంభమైంది గజ్వేల్ నుంచే అని.. తిరిగి అక్కడికే తాను చేరుకుంటానని ఈటల అన్నారు. కొద్ది రోజుల్లో బీజేపీలోకి భారీ చేరికలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ నడుస్తోందని, సీక్రెట్ ఆపరేషన్ కూడా చేస్తున్నట్లు ఈటెల వెల్లడించారు.

రాష్ట్రంలో సీఎంగా, గజ్వేల్‌లో ఎమ్మెల్యేగా సీఎం గ్రాఫ్ పడిపోయిందని ఈటెల అన్నారు. బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను చేర్చుకుంటే తాము చూస్తూ ఊరుకుంటామా? తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఈటల చెప్పారు. కేసీఆర్‌ను ఢీ కొట్టి ఓడించాలంటే అందరం ఈగోలు పక్కన పెట్టి లక్ష్యం కోసం పని చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. బెంగాల్‌లో సువేందు అధికారి మమతను ఓడించిన తరహాలోనే.. తాను కేసీఆర్‌ను ఓడించి తీరతానని శపథం చేశారు.

అర్జునుడికి పక్షి తల మాత్రమే కన్పించినట్లు, బీజేపీకి కేసీఆర్ మాత్రమే కనిపించాలని ఆయన అన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి ఇప్పటికే తెలంగాణ ప్రజలు సిద్దమయ్యారని ఈటల వివరించారు. రోజు రోజుకూ ఆయన గ్రాఫ్ పడిపోతోందని ఈటెల స్పష్టం చేశారు. ప్రశ్నించేతత్వం తెలంగాణ మట్టిలోనే సహజంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

పోడు భూముల విషయంలో కేసీఆర్ మాట తప్పారని ఈటల అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2005లో పోడు భూముల విషయంలో చట్టం చేసిందని.. 2006లో అది పార్లమెంటులో ఆమోదం పొందిందని ఈటల గుర్తు చేశారు. తమ భూములు తమకే కేటాయించాలని గిరిజనులు అడుగుతుంటే వారిపై దాడులు చేయిస్తున్నారని ఈటల మండిపడ్డారు. కేసీఆర్ చెప్పే మాటలకు, చేసే పనులకు అసలు సంబంధం ఉండదని ఈటల విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News