బాబు ముందే కుమ్ముకున్న తెలుగు తమ్ముళ్లు..

మహానాడు ఘనంగా జరిగింది, మినీ మహానాడులు అంతకంటే బాగా జరుగుతున్నాయని చెబుతున్నారు చంద్రబాబు. కానీ కొన్నిచోట్ల మాత్రం ఆయనకు తలనొప్పులు తప్పడంలేదు. అసలే నాయకులు లేరు, 2024లో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని వెదుక్కోవాల్సిన పరిస్థితి ఉందని బాబు బాధపడుతుంటే.. ఉన్న నాయకుల్లో కూడా సఖ్యత లేకపోవడం మరో విశేషం. తాజాగా అన్నమయ్య జిల్లా కలికిరిలోని పుంగనూరులో జరిగిన టీడీపీ ఆత్మీయ సమావేశం రసాభాసగా మారింది. అధినేత చంద్రబాబు ముందే తెలుగు తమ్ముళ్లు కుమ్ములాట మొదలు పెట్టారు. మాది క్రమశిక్షణ […]

Advertisement
Update:2022-07-08 01:26 IST

మహానాడు ఘనంగా జరిగింది, మినీ మహానాడులు అంతకంటే బాగా జరుగుతున్నాయని చెబుతున్నారు చంద్రబాబు. కానీ కొన్నిచోట్ల మాత్రం ఆయనకు తలనొప్పులు తప్పడంలేదు. అసలే నాయకులు లేరు, 2024లో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని వెదుక్కోవాల్సిన పరిస్థితి ఉందని బాబు బాధపడుతుంటే.. ఉన్న నాయకుల్లో కూడా సఖ్యత లేకపోవడం మరో విశేషం. తాజాగా అన్నమయ్య జిల్లా కలికిరిలోని పుంగనూరులో జరిగిన టీడీపీ ఆత్మీయ సమావేశం రసాభాసగా మారింది. అధినేత చంద్రబాబు ముందే తెలుగు తమ్ముళ్లు కుమ్ములాట మొదలు పెట్టారు.

మాది క్రమశిక్షణ ఉన్న పార్టీ, టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణ గల సైనికులంటూ చెప్పుకునే చంద్రబాబు ముందే నాయకులు, వారికి అనుకూలంగా స్టేజిపైకి వచ్చిన కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకున్నారు. చివరకు కుర్చీలు విరిగేలా కొట్టుకున్నారు. నువ్వు పార్టీని అమ్ముకున్నావంటే, కాదు నువ్వే పార్టీని తాకట్టు పెట్టావంటూ విమర్శించుకున్నారు. చివరకు చేయాల్సిందంతా చేసి ఇరు వర్గాలు జై బాబు, జైజై బాబు అంటూ అక్కడినుంచి వెళ్లిపోవడం విశేషం.

పుంగనూరు సభలో టీడీపీ నేత ఎస్.కె.రమణారెడ్డి స్టేజ్ ఎక్కేందుకు ముందుకొచ్చారు. దీంతో కొందరు ఆయన్ను అడ్డుకున్నారు. రమణారెడ్డి పార్టీకి నష్టం కలిగించిన వ్యక్తి అని, పార్టీ ఓడిపోయిన తర్వాత మూడేళ్లపాటు ఆయన అడ్రస్ లేడని, ఇప్పుడు అధినేత చంద్రబాబు రావడంతోనే ఆయన పార్టీలో పెత్తనంకోసం వస్తున్నారని వారు ఆరోపించారు.

ఇన్నాళ్లూ కనపడకుండా పోయి, పార్టీని పట్టించుకోని రమణారెడ్డి, ఇప్పుడు కూడా పార్టీకి చెడుచేసేందుకే వచ్చాడని విమర్శించారు. మాజీ ఇన్ చార్జ్ అనూషారెడ్డికి కూడా వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. రమణారెడ్డిని బలవంతంగా సమావేశం నుండి పంపించివేశారు. చంద్రబాబు ముందే పలువురు నేతలు కుర్చీలతో కొట్టుకున్నారు. చేసేదేం లేక ఆ వేడి చల్లారే వరకు బాబు వేచి చూశారు.

చివరకు అక్కడ మిగిలినవారికి సర్ది చెప్పి సభ సజావుగా సాగేలా చేశారు. పుంగనూరు టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు మరోసారి చంద్రబాబు ముందే బయటపడ్డాయి. మాటలతో సరిపెట్టకుండా ఏకంగా ఫైటింగ్ సీన్ క్రియేట్ చేసే సరికి చంద్రబాబు కూడా షాకయ్యారు.

Tags:    
Advertisement

Similar News