కాంగ్రెస్ అసమ్మతి నేతకు బీజేపీ గాలం

ఎన్నాళ్లని ఒకే పార్టీలో..ఒకే నాయకత్వం కింద ..కిందా, పడుతూ .. నువ్వు మారాలంటూ లేఖలు రాస్తూ కూర్చుంటాం? ఏదో ఒకరోజు విసుగొచ్చేస్తుంది. వాళ్ళు మారకపోతే కనీసం మనమైనా మారదాం అన్న థాట్ వచ్చేస్తుంది. జంప్ జిలానీ ఆలోచనలతో సతమతమైపోతూనే చివరకు జంప్ కావడానికి టైం రాగానే అదే పనిలో నిమగ్నమవుతాం. .. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ విషయంలో ఇదే జరుగుతోంది. ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ. నడ్డాతో భేటీ […]

Advertisement
Update:2022-07-08 03:34 IST

ఎన్నాళ్లని ఒకే పార్టీలో..ఒకే నాయకత్వం కింద ..కిందా, పడుతూ .. నువ్వు మారాలంటూ లేఖలు రాస్తూ కూర్చుంటాం? ఏదో ఒకరోజు విసుగొచ్చేస్తుంది.

వాళ్ళు మారకపోతే కనీసం మనమైనా మారదాం అన్న థాట్ వచ్చేస్తుంది. జంప్ జిలానీ ఆలోచనలతో సతమతమైపోతూనే చివరకు జంప్ కావడానికి టైం రాగానే అదే పనిలో నిమగ్నమవుతాం. .. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ విషయంలో ఇదే జరుగుతోంది. ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ. నడ్డాతో భేటీ అయ్యారు.

మరి మీటింగ్ ఎంతసేపు జరిగిందో తెలియదు గానీ, ఇక శర్మగారు కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటూ వార్తలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్నడూ లేనిది ఈయన ఇంత అకస్మాత్తుగా కమలం శిబిరంలోకి ఎందుకు వెళ్ళాడబ్బా అని అనుకుంటుండగా .. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం గుర్తుకొచ్చింది.

ఈ రాష్ట్రం నుంచే ఆనంద్ శర్మ పార్లమెంట్ ఎగువసభకు ఎన్నికయ్యారు. మరికొన్ని నెలల్లో హిమాచల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన నడ్డాతో మీట్ అవడం చూస్తే ఏదో పెద్ద ఆలోచనతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ ఈ భేటీని ఆయన అల్లాటప్పాగా కొట్టి పారేశారు.

నడ్డాను కలుసుకునే హక్కు తనకెంతయినా ఉందని, తనకు ఆయన బీజేపీ అధ్యక్షుడు మాత్రమే కాదని, తామిద్దరం ఒకే రాష్ట్రానికి చెందినవారమని, ఇంతమాత్రానికే నేను ఆ పార్టీలో చేరుతానని ఎలా అనుకుంటారని మీడియా వద్ద చిర్రుబుర్రులాడారు. అసలు దీనికి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అంటూ ఏమీ లేదంటూ తేలిగ్గా తీసిపారేశారు.

నేను కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఈ పార్టీకి, బీజేపీకి మధ్య సిధ్ధాంత వైరుధ్యాలు ఉంటాయని, అంతమాత్రాన మా ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉంటాయనుకోరాదని ఆనంద్ శర్మ ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. మా ఆలోచనలను మా సామాజిక శత్రువులుగా చూడకండి అని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఒక్కసారి ఈయన గతంలోకి వెళ్లి తొంగి చూస్తే.. ఒకనాడు కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు చేసిన నేతల్లో ఈయన కూడా ఒకరన్న విషయం మర్చిపోలేం.

పార్టీ నాయకత్వం మీద శర్మ చాలాసార్లు అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నాడు ‘అసమ్మతి లేఖ’ రాసిన 23 మంది నేతల్లో ఈయన కూడా ఒకరు. కాంగ్రెస్ పార్టీలో ప్రక్క్షాళన జరగాలని, సంస్థాగత ఎన్నికలను ఎప్పటికప్పుడు నిర్వహించాలని.. ఇలాగే బాహాటంగా మరెన్నో అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు.

ఒక విధంగా అది సోనియా నాయకత్వాన్ని సవాలు చేసినట్టే ! ఇప్పుడు ఆయన నడ్డాను కలిశారంటే హిమాచల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అని భావించవలసి వస్తుంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశంపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం.

అన్నీ సక్రమంగా జరిగితే శర్మ గారు కాంగ్రెస్ నుంచి కమలం గూటికి చేరి.. ఎన్నికల్లో ఈ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినా గెలవవచ్చు.. ఆ తరువాత సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయనేతగా ఈ చిన్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కావచ్చు.. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం మరి !

Tags:    
Advertisement

Similar News