డ్రమ్స్ కొట్టి భర్త ఏక్ నాథ్ షిండేకి వెల్‌కం చెప్పిన భార్య

నిన్న మొన్నటివరకు జస్ట్ మంత్రిగా ఉన్న భర్త ఏకంగా పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆ భార్య ఆనందానికి అవధులు ఉంటాయా..? ఊహించని ఈ మార్పుతో ఉబ్బితబ్బిబ్బైపోతున్న ఆమె ఎలా ఆయనకు స్వాగతం చెప్పాలా అని ఆలోచించింది. మరి ఏం చేసిందంటే థానే సిటీలోకి వెళ్ళాల్సిందే.. మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక మొదటిసారిగా థానేలోని తన ఇంటికి వచ్చిన ఏక్ నాథ్ షిండేకి తన భార్య లతా షిండే నుంచి ఘన స్వాగతం లభించింది. డ్రమ్స్ వాయిస్తూ […]

Advertisement
Update:2022-07-06 11:51 IST

నిన్న మొన్నటివరకు జస్ట్ మంత్రిగా ఉన్న భర్త ఏకంగా పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆ భార్య ఆనందానికి అవధులు ఉంటాయా..? ఊహించని ఈ మార్పుతో ఉబ్బితబ్బిబ్బైపోతున్న ఆమె ఎలా ఆయనకు స్వాగతం చెప్పాలా అని ఆలోచించింది. మరి ఏం చేసిందంటే థానే సిటీలోకి వెళ్ళాల్సిందే..

మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక మొదటిసారిగా థానేలోని తన ఇంటికి వచ్చిన ఏక్ నాథ్ షిండేకి తన భార్య లతా షిండే నుంచి ఘన స్వాగతం లభించింది. డ్రమ్స్ వాయిస్తూ ఆమె ..ఆయనకు గ్రాండ్ వెల్ కం చెప్పింది. ఇతర వాయిద్యకారులతో కలిసి ఆమె ఇలా సంతోషంతో పొంగిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేడం హుషారు, జోరు చూసి తప్పెట్లు, తాళాలు మోగిస్తున్న ఇతరుల్లో కూడా జోష్ పెరిగిపోయింది. మూడు వారాల క్రితం రెబల్ శివసేన ఎమ్మెల్యేలతో కలిసి షిండే థానే లోని తన ఇంటిని వీడారు. రాష్ట్రంలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టేంతవరకు ఆయన విశ్రమించలేదు. ముంబై నగరం నుంచి మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఆయన తన మద్దతుదారులు, కార్యకర్తలతో థానే చేరుకున్నారు.

ఇక ఆనందనగర్ లోని షిండే ఇంటివద్ద కోలాహలం చెప్పత‌రం కాదు. విపరీతంగా వర్షం కురుస్తున్నా షిండేని అభినందించడానికి వచ్చిన వందలాది మందితో అక్కడ సందడి నెలకొంది. మొదట ఆయన శివసేన వ్యవస్థాపకుడు ఆనంద్ దీఘేకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు మాట్లాడిన షిండే.. బాల్ థాక్రే సిధ్ధాంతాలను నమ్మినవారికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే తన తిరుగుబాటు జరిగిందని చెప్పుకున్నారు. తనను అభినందించడానికి వచ్చినవారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. థానేలో ఆయనకు లభించిన ఘన స్వాగతం చూస్తే ఈ తిరుగుబాటుకు, బీజేపీతో ఆయన మైత్రికి జనాల ఆమోదం లభించినట్టే భావించాల్సి వస్తుందని అంటున్నారు.

ఈ సందర్భంగా లతా షిండే గురించి కూడా చెప్పుకోక తప్పదు.. తన భర్త ఒకప్పుడు ఆటో డ్రైవర్ గా ఉన్నప్పుడు.. రాజకీయంగా ఆయన కెరీర్ ఎదగడానికి ఆమె ఎంతో సహకరించిందట. అయితే వీరి వైవాహిక జీవితంలో విషాద సంఘటనలు కూడా లేకపోలేదు. వీరికి ముగ్గురు పిల్లలు ఉండగా ఇద్దరు 2000 సంవత్సరంలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించారు. ఈ సంఘటన తలచుకుని షిండే ఇటీవల అసెంబ్లీలో కంటతడి పెట్టారు. 2000 లో తన 11 ఏళ్ళ దీపేష్, ఏడేళ్ల కుమార్తె శుభద ఈ యాక్సిడెంట్ లో మృతి చెందారని, అప్పుడు తాను థానేలో శివసేన కార్పొరేటర్ గా ఉన్నానని ఆయన తెలిపారు. ఇక తన జీవితమే అయిపోయిందని బాధపడ్డానని పేర్కొన్నారు. అయితే ఆనంద్ దీఘే తననెంతో ఓదార్చి.. పొలిటికల్ కెరీర్ ని కొనసాగించాల్సిదిగా నచ్చజెప్పారని వెల్లడించారు. కాగా 2004 లో షిండే మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు.

Tags:    
Advertisement

Similar News