భారత్ లో నగరాలు మరీ అంత తీసిపోయాయా..?

భారత్ పెట్టుబడుల స్వర్గధామం అని అంటారొకరు, భారత్ లో జీవన ప్రమాణాలు అద్భుతం అని అంటారు ఇంకొకరు. ఇలా రాజకీయ నాయకులు ఎవరికి వారే గొప్పలు చెప్పుకోవడం మినహా.. అసలు భారత్ లోని నగరాల్లో ఆ స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయా..? అసలు జనజీవనం ఇక్కడ సంతోషంగా ఉందా..? నివాస యోగ్యమైన పట్టణాల లిస్ట్ లో భారత్ ఉందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే.. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) చేసిన సర్వేలో భారత్ లోని […]

Advertisement
Update:2022-07-05 08:05 IST

భారత్ పెట్టుబడుల స్వర్గధామం అని అంటారొకరు, భారత్ లో జీవన ప్రమాణాలు అద్భుతం అని అంటారు ఇంకొకరు. ఇలా రాజకీయ నాయకులు ఎవరికి వారే గొప్పలు చెప్పుకోవడం మినహా.. అసలు భారత్ లోని నగరాల్లో ఆ స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయా..? అసలు జనజీవనం ఇక్కడ సంతోషంగా ఉందా..? నివాస యోగ్యమైన పట్టణాల లిస్ట్ లో భారత్ ఉందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఎందుకంటే.. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) చేసిన సర్వేలో భారత్ లోని నగరాల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 173 నగరాల్లో జీవన స్థితిగతులను అంచనా వేయగా.. అందులో భారతీయ నగరాలు అట్టడుగు స్థానంలో ఉండటం విశేషం.

EIU గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్- 2022 తాజాగా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో జీవన పరిస్థితులను ఈ నివేదిక విశ్లేషించింది. వీటిలో భారత్ నుంచి 5 నగరాలు ఎంపికయ్యాయి. అయితే ఈ ఐదు నగరాలు కూడా మొదటి 100లో చోటు సంపాదించకపోవడం విశేషం. భారతీయ నగరాలు ఐదూ.. 140 మరియు 146 మధ్య ర్యాంక్ లు పొందాయి. బెంగళూరు జీవన స్థితిగతులు అధ్వాన్నంగా ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది.

56.5 నివాసయోగ్యత స్కోర్‌ తో ఢిల్లీ ఈ జాబితాలో 140 వ ర్యాంక్ సాధించింది. ముంబై స్కోర్ 56.2 ర్యాంక్- 141. చెన్నై ర్యాంక్-142 స్కోర్-53.2 అహ్మదాబాద్ స్కోర్ 55.7 కాగా ర్యాంక్-143 ఈ లిస్ట్ లో చివర బెంగళూరు ఉంది. బెంగళూరు 54.4 స్కోర్ తో 146వ ర్యాంక్ సాధించింది. ఈ ఏడాది కొత్తగా చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ లను జాబితాలో చేర్చారు.

మిగతా విషయాల్లో ఇతర నగరాలతో పోటీ పడుతున్నా.. మౌలిక సదుపాయాల లేమి బెంగళూరుని చివరి స్థానంలో నిలిపిందని ఈ నివేదిక తెలిపింది. మౌలిక సదుపాయాల విషయంలో బెంగళూరుకి నూటికి 46.4 మార్కులే రావడం విశేషం. ఈ నివేదికలో చిట్టచివరి స్థానం పొందిన పాకిస్తానీ నగరం కరాచీ కూడా మౌలిక వసతుల విషయంలో బెంగళూరుకంటే మెరుగ్గా ఉండటం విశేషం. రోడ్ల నాణ్యత, ప్రజా రవాణా వ్యవస్థ, అంతర్జాతీయ రవాణా, ఇంధన సదుపాయం, టెలికమ్యూనికేషన్స్, నీరు, నాణ్యమైన గృహవసతి.. వంటి వాటిని పరిగణలోకి తీసుకుని మౌలిక వసతుల ర్యాంక్ లు ఇచ్చారు.

ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) నివేదికల ఆధారంగా.. ఆయా నగరాలకు వెళ్లే వారికి కంపెనీలు అలవెన్స్ లు ఇస్తుంటాయి. అత్యంత నివాసయోగ్యమైన నగరాలనుంచి, నివాస యోగ్యత తక్కువగా ఉండే నగరాలకు వెళ్తే వారికి ఎక్కువ భత్యం చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News