రూ.20 టీ కి సేవా ప‌న్ను రూ.50..వెర‌సి చాయ్ ఖ‌రీదు రూ.70!

‘చార్ అణా కోడికి బార‌ణా మ‌సాలా ( పావ‌లా కోడికి ముప్పావ‌లా మ‌సాలా)’ అనే సామెత‌ను ఐఆర్‌టిసీ అక్ష‌రాలా పాటిస్తోంది. శ‌తాబ్ధి ఎక్స్ ప్రెస్ లో చాయ్ తాగితే దాని ఖ‌రీదు కంటే రెండు రెట్ల‌కు పైగా స‌ర్వీస్ ఛార్జి పేరుతో అద‌నంగా వ‌సూలు చేస్తూ ప్ర‌యాణీకుల‌కు చుక్క‌లు చూపిస్తోంది. చాయ్ ఖ‌రీదు రూ.20 అయితే స‌ర్వీస్ చార్జి కింద రూ.50 వ‌సూలు చేస్తున్నారు. దీంతో ఒక్క చాయ్ ఖ‌రీదు రూ.70 అవుతోంది. దీంతో టీ తాగిన […]

Advertisement
Update:2022-07-04 06:24 IST

‘చార్ అణా కోడికి బార‌ణా మ‌సాలా ( పావ‌లా కోడికి ముప్పావ‌లా మ‌సాలా)’ అనే సామెత‌ను ఐఆర్‌టిసీ అక్ష‌రాలా పాటిస్తోంది. శ‌తాబ్ధి ఎక్స్ ప్రెస్ లో చాయ్ తాగితే దాని ఖ‌రీదు కంటే రెండు రెట్ల‌కు పైగా స‌ర్వీస్ ఛార్జి పేరుతో అద‌నంగా వ‌సూలు చేస్తూ ప్ర‌యాణీకుల‌కు చుక్క‌లు చూపిస్తోంది.

చాయ్ ఖ‌రీదు రూ.20 అయితే స‌ర్వీస్ చార్జి కింద రూ.50 వ‌సూలు చేస్తున్నారు. దీంతో ఒక్క చాయ్ ఖ‌రీదు రూ.70 అవుతోంది. దీంతో టీ తాగిన సంతృప్తిని కో్ల్పోతున్నారు ప్ర‌యాణీకులు.

ఇటీవల ఢిల్లీ-భోపాల్ మ‌ధ్య న‌డిచే శ‌తాబ్ధి ఎక్స్ స్రెస్ రైలులో ఓ ప్ర‌యాణీకుడికి ఈ చేదు అనుభ‌వం ఎదురైంది. ఆయ‌న ఐఆర్‌టిసీ నిర్వాకాన్ని తీవ్రంగా విమ‌ర్శిస్తూ సోష‌ల్ ల్ మీడియా లో ఈ దోపిడీని వివ‌రిస్తూ పోస్టు పెట్టారు.

“20 రూపాయల టీ పై 50 రూపాయల పన్ను, దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగా మారిపోయింది, ఇప్పటివరకు చరిత్ర మాత్రమే మారిపోయింది!” అని ప్రయాణీకుడు ట్వీట్ చేశాడు.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, రైల్వే అధికారులు స్పందిస్తూ..ప్రయాణికుల నుండి నిర్దేశించిన దాని కంటే అదనంగా ఏమీ వసూలు చేయలేదని స్పష్టం చేశారు. ప్రయాణికుడి నుంచి తాము అదనంగా ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని వివరణ ఇచ్చారు.

రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో ముందుగా ఆహారం బుక్ చేసుకోకుండా ప్రయాణ సమయంలో బుక్ చేస్తే రూ. 50 సర్వీస్ చార్జ్ చెల్లించాల్సి ఉంటుందంటూ 2018లో జారీ చేసిన సర్క్యులర్ లోని విష‌|యాల‌ను ప్రస్తావించారు. అయితే రెస్టారెంట్ల‌లో స‌ర్వీస్ చార్జిలు వ‌సూలు చేయ‌రాదంటూ ప్ర‌భుత్వం ఇటీవ‌ల జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా గుర్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News