హోట‌ళ్ళ‌లో ఇక స‌ర్వీస్ ఛార్జీలు ఉండ‌వ్‌..కేంద్రం ప్ర‌క‌ట‌న‌

హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌కు వెళ్ళే వారికి కేంద్రం సంతోషం క‌లిగించే వార్త‌ను ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ వినియోగ‌దారుల‌కు బిల్లుకు తోడు సర్వీస్ చార్జీల‌ను కూడా వ‌డ్డిస్తూ న‌డ్డి విరిచేవారు. ఇకపై వినియోగ‌దారుల‌కు ఈ బాధ నుంచి విముక్తి క‌లిగిస్తూ కేంద్రం ప్ర‌భుత్వం సర్వీస్ చార్జీల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు సోమ‌వారంనాడు ఒక ప్ర‌క‌ట‌న చేసింది. ఇక‌పై ఏ హోటల్ గానీ, రెస్టారెంట్ గానీ స‌ర్వీస్ చార్జీల‌ను వ‌సూలు చేయ‌కూడ‌దంటూ హెచ్చ‌రించింది. ఏ బిల్లుకు అయినా జీఎస్టీ ప‌న్ను వ‌సూలు […]

Advertisement
Update:2022-07-04 16:41 IST

హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌కు వెళ్ళే వారికి కేంద్రం సంతోషం క‌లిగించే వార్త‌ను ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ వినియోగ‌దారుల‌కు బిల్లుకు తోడు సర్వీస్ చార్జీల‌ను కూడా వ‌డ్డిస్తూ న‌డ్డి విరిచేవారు.

ఇకపై వినియోగ‌దారుల‌కు ఈ బాధ నుంచి విముక్తి క‌లిగిస్తూ కేంద్రం ప్ర‌భుత్వం సర్వీస్ చార్జీల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు సోమ‌వారంనాడు ఒక ప్ర‌క‌ట‌న చేసింది.

ఇక‌పై ఏ హోటల్ గానీ, రెస్టారెంట్ గానీ స‌ర్వీస్ చార్జీల‌ను వ‌సూలు చేయ‌కూడ‌దంటూ హెచ్చ‌రించింది.
ఏ బిల్లుకు అయినా జీఎస్టీ ప‌న్ను వ‌సూలు చేస్తున్న నేప‌థ్యంలో స‌ర్వీస్ చార్జీ అనే మాటే ఉత్ప‌న్నం కాకూడ‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది.

వ‌స్తువులు, సేవ‌ల‌పై జీఎస్టీ పేరిట ప‌న్ను వేస్తున్న‌ప్పుడు ఇక హోట‌ళ్లు, రెస్టారెంట్లు స‌ర్వీస్ చార్జీల పేరిట అద‌న‌పు ప‌న్ను వేస్తున్న విష‌యం కేంద్రం దృష్టికి వ‌చ్చింది. దీనిని ప‌రిశీలించిన‌ కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ఈ మేర‌కు స‌ర్వీస్ చార్జీలు వ‌సూలు చేయ‌రాదంటూ ఆదేశాలు జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News