ఈజ్ ఆఫ్ సెల్లింగ్ లో బీజేపీ నెంబర్ -1

ఇటీవలే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కేంద్రం ర్యాంకులు ప్రకటించింది. మొదటి స్థానంలో ఏపీ ఉండగా, టాప్ లిస్ట్ లో తెలంగాణ కూడా చోటు సంపాదించుకుంది. ఈ లిస్ట్ పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. తమ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనే కాదు, పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా టాప్ ప్లేస్ లో ఉందని చెప్పారు. ఇక ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందన బీజేపీకి […]

Advertisement
Update:2022-07-02 06:48 IST

ఇటీవలే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కేంద్రం ర్యాంకులు ప్రకటించింది. మొదటి స్థానంలో ఏపీ ఉండగా, టాప్ లిస్ట్ లో తెలంగాణ కూడా చోటు సంపాదించుకుంది. ఈ లిస్ట్ పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. తమ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనే కాదు, పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా టాప్ ప్లేస్ లో ఉందని చెప్పారు. ఇక ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందన బీజేపీకి సుర్రుమనిపించేలా ఉంది.

అయితే అంతకు ముందే ఈ ర్యాంకుల విషయంలో ఏపీ బీజేపీ నేతలు.. వైసీపీ నాయకుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో ఏపీ ముందుందని అంటున్నారని, కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవన్నారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. ఈ ర్యాంకింగ్స్ విధానాన్ని పునః సమీక్షించాలని జీవీఎల్ కోరారు. దీంతో వైపీపీ నేతలు మండిపడుతున్నారు. ర్యాంకులు ప్రకటించింది బీజేపీ ప్రభుత్వమే, వాటిపై విమర్శ‌లు చేస్తోంది కూడా బీజేపీ నేతలేనంటూ సెటైర్లు వేశారు ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుంటోందని విమర్శించారు.

ఈజ్ ఆఫ్ సెల్లింగ్ ఇండస్ట్రీస్..
ఏపీలో జగన్‌ ప్రభుత్వం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో నెంబర్-1 అయితే.. దేశంలోనే ప్రముఖ కర్మాగారాలను అమ్మకానికి పెడుతూ ఈజ్‌ ఆఫ్‌ సెల్లింగ్‌ ఇండస్ట్రీస్ లో బీజేపీ నెంబర్-1 గా ఉందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పారిశ్రామికరంగంలో కీలక మార్పులు తీసుకొస్తున్న వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని బీజేపీ నేతల విజ్ఞతకే వదిలి పెడుతున్నామని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 60 పరిశ్రమలను అమ్మకానికి పెట్టింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు అమర్నాథ్. స్టీల్‌ ప్లాంట్‌ ను కేంద్రం అమ్మాలని చూస్తుంటే రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. ఎయిర్ ఫోర్స్, రైల్వేస్, డిఫెన్స్.. అన్నింటినీ ప్రైవేటుపరం చేయాలనుకుంటోంది బీజేపీ కాదా అని అడిగారు.

డిపాజిట్లు చూసుకోండి..
175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందనే ధీమా ఉంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలంటూ జీవీఎల్ విసిరిన సవాల్ పై కూడా అమర్నాథ్ స్పందించారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ఎక్కడా డిపాజిట్లు రాలేదని, తిరిగి 175 స్థానాల్లో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోవాలని ఆ పార్టీకి ఆతృతగా ఉందన్నారు అమర్నాథ్. అంత సరదాగా ఉంటే పోటీకి సిద్ధం కావాలంటూ సవాల్ విసిరారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు కావాలని కోరుకోవడం వింతగా ఉందన్నారు అమర్నాథ్.

Tags:    
Advertisement

Similar News