ఆమె మాట్లాడితే సూక్తులు, మేము మాట్లాడితే బూతులా?

టీడీపీ నేత వంగలపూడి అనితపై.. వైసీపీ మహిళా విభాగం నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడూ అనితకు ఈ స్థాయిలో కౌంటర్లు పడలేదు. ఒకరకంగా వైసీపీ మహిళా విభాగం కూడా కాస్త స్తబ్దుగా ఉందనే చెప్పాలి. కానీ ఇప్పుడు వారు కూడా రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. అనితకు ఫుల్ డోస్ ఇచ్చేశారు. దళిత ద్రోహి అనితకు.. టీడీపీలో యామిని, దివ్యవాణికి పట్టిన గతే పడుతుందని మండిపడ్డారు. చింతకాయల చింతామణి.. అనిత మీడియా ముందుకొచ్చి నీతులు […]

Advertisement
Update:2022-06-30 03:25 IST

టీడీపీ నేత వంగలపూడి అనితపై.. వైసీపీ మహిళా విభాగం నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడూ అనితకు ఈ స్థాయిలో కౌంటర్లు పడలేదు. ఒకరకంగా వైసీపీ మహిళా విభాగం కూడా కాస్త స్తబ్దుగా ఉందనే చెప్పాలి. కానీ ఇప్పుడు వారు కూడా రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. అనితకు ఫుల్ డోస్ ఇచ్చేశారు. దళిత ద్రోహి అనితకు.. టీడీపీలో యామిని, దివ్యవాణికి పట్టిన గతే పడుతుందని మండిపడ్డారు.

చింతకాయల చింతామణి..
అనిత మీడియా ముందుకొచ్చి నీతులు చెబుతూ.. అబద్దాలు వల్లె వేస్తుంటే దెయ్యం బ్రేక్‌ డ్యాన్స్‌ చేసినట్లుందని మండిపడ్డారు వైసీపీ మహిళా విభాగం నేతలు. నౌకల్లో రికార్డింగ్‌ డ్యాన్సులు చేయడం ఆమెకు అలవాటని అన్నారు. చింతకాయల చింతామణి డ్రామా కంపెనీ, గంజాయి కంపెనీ, బ్రోకర్ల హౌస్‌ కు ఓనర్లు.. అరగుండు అయ్యన్న, అనితలేనని విమర్శించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తపైనే రేప్‌ కేసు పెట్టిన ఘనత అనితకే సొంతం అని దెప్పిపొడిచారు. ఆమె మాట్లాడితే సూక్తులు, మేము మాట్లాడితే బూతులా? అని ప్రశ్నించారు.

మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది జగనే..
మహిళలకు అన్ని పదవుల్లో 50శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కేవలం సీఎం జగన్ మాత్రమేనని చెప్పారు వైసీపీ మహిళా విభాగం నేతలు. టీడీపీలో మహిళలకు ఏపాటి గౌరవం ఇస్తారో.. యామిని, దివ్యవాణిని అడిగితే చెబుతారని చెప్పారు. ఎన్టీఆర్‌ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి టీడీపీని కబ్జా చేస్తే.. అక్కడ అనిత బానిసలా బతుకుతోందని అన్నారు. అనిత రూ.70 లక్షలు ఖర్చు పెట్టి ఏ సర్జరీ చేయించుకుందో చెప్పాలన్నారు. ఆ డబ్బులు ఎగ్గొట్టినందుకు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని చెప్పారు. మొత్తానికి వైసీపీ మహిళా విభాగం నాయకులు కాస్త జోరు పెంచారు. టీడీపీ నుంచి వస్తున్న కౌంటర్లకు అదే స్థాయిలో బదులివ్వడం మొదలు పెట్టారు.

Tags:    
Advertisement

Similar News