తీస్తా సెతల్వాద్ అరెస్టుపై ఐరాస మానవ హక్కుల సంఘం ఫైర్
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్టును ఐరాస మానవ హక్కుల సంఘం ఖండించింది. ఆమెతో పాటు మరో ఇద్దరి అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే వీరు చేసిన తప్పయిందా అని ప్రశ్నించింది. సెతల్వాద్ తో పాటు ఆర్.బీ. శ్రీకుమార్, సంజీవ్ భట్ లను అరెస్టు చేసి వేధించడం తగదని, వెంటనే వారిని విడుదల చేయాలని కోరింది. 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను వీరు తారుమారు చేశారని అహ్మదాబాద్ పోలీసులు ఆరోపించిన […]
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్టును ఐరాస మానవ హక్కుల సంఘం ఖండించింది. ఆమెతో పాటు మరో ఇద్దరి అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే వీరు చేసిన తప్పయిందా అని ప్రశ్నించింది. సెతల్వాద్ తో పాటు ఆర్.బీ. శ్రీకుమార్, సంజీవ్ భట్ లను అరెస్టు చేసి వేధించడం తగదని, వెంటనే వారిని విడుదల చేయాలని కోరింది.
2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను వీరు తారుమారు చేశారని అహ్మదాబాద్ పోలీసులు ఆరోపించిన సంగతి గమనార్హం. పైగా ఈ కేసులో దర్యాప్తునకు సిట్ బృందాన్ని కూడా వారు ఏర్పాటు చేశారు. ఈ ముగ్గురి అరెస్టును ఖండిస్తూ పలు అంతర్జాతీయ సంస్థలు సైతం ప్రకటనలు చేశాయి. పోలీసుల చర్యను తీవ్రంగా తప్పుపట్టాయి. 2002 నాటి అల్లర్ల బాధితులకు వీరు సంఘీభావం ప్రకటించారని, హెట్రేడ్, విచక్షణను తీవ్రంగా వ్యతిరేకించే సెతల్వాద్ ను తక్షణమే రిలీజ్ చేయాలని ఐరాసలో మానవహక్కుల కార్యకర్త మేరీ లాలోర్ డిమాండ్ చేశారు. మానవ హక్కులను సమర్థించడం నేరమెలా అవుతుందని ఆమె ప్రశ్నించారు.
ఆ నాటి అల్లర్ల గురించి సెతల్వాద్, ఈ ఇద్దరు అధికారులు పోలీసులకు తప్పుడు సమాచారమిచ్చారని హోం మంత్రి అమిత్ షా ఓ ఇంటర్వ్యూలో ఆరోపించడంతో గుజరాత్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఈ అరెస్టులకు పూనుకున్నారు. కానీ, ఇందులో ఔచిత్యం లేదని మేరీ విమర్శించారు. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సెతల్వాద్, మరో యాక్టివిస్ట్ జకియా జాఫ్రి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కాగా, సెతల్వాద్ ను, మరో ఇద్దరినీ వెంటనే విడుదల చేయాలంటూ ఐరాస మానవ హక్కుల సంఘ కార్యాలయం కోరడం భారత అంతర్గత న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకోవడమే అవుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాఘ్చి ఆరోపించారు. ఇది అనుచితమని, ఒకరకంగా భారత అంతరంగిక వ్యవహారాల్లో తలదూర్చడమే అవుతుందన్నారు. భారతీయ చట్టాల ఉల్లంఘన జరిగినప్పుడు జ్యూడిషియల్ ప్రాసెస్ ను అనుసరించి అధికారులు వీరిపై చర్య తీసుకున్నారని ఆయన చెప్పారు. ఇలాంటి లీగల్ చర్యలను వేధింపులుగా ముద్ర వేయడం తప్పుదారి పట్టించేదిగా ఉందని, ఇది అంగీకార యోగ్యం కాదని బాఘ్చి పేర్కొన్నారు.