ఆ ఐదుగురి సజీవ దహనానికి ఉడుతే కారణమా ?

ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లిలో 5గురు కూలీల సజీవ దహనం సంఘటనకు ఉడుతే కారణమని తేల్చేరు అధికారులు. వ్యవసాయ కూలీ పనుల కోసం తాడిమర్రి మండలం గుడ్డంపల్లి నుంచి చిల్లకొండయ్యపల్లి కి ఆటో ట్రాలీలో వెళ్తున్న కూలీలపై విద్తుత్తు హైటెన్షన్ తీగలు పడి మంటలు అంటుకొని 5గురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన విద్యుత్ అధికారులు ఆ ప్రమాదానికి ఉడుతే కారణమని తేల్చారు. ఉడుత షాట్ అయినప్పుడు లైన్ కట్ […]

Advertisement
Update:2022-06-30 08:34 IST

ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లిలో 5గురు కూలీల సజీవ దహనం సంఘటనకు ఉడుతే కారణమని తేల్చేరు అధికారులు.

వ్యవసాయ కూలీ పనుల కోసం తాడిమర్రి మండలం గుడ్డంపల్లి నుంచి చిల్లకొండయ్యపల్లి కి ఆటో ట్రాలీలో వెళ్తున్న కూలీలపై విద్తుత్తు హైటెన్షన్ తీగలు పడి మంటలు అంటుకొని 5గురు సజీవ దహనమయ్యారు.

ఈ సంఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన విద్యుత్ అధికారులు ఆ ప్రమాదానికి ఉడుతే కారణమని తేల్చారు. ఉడుత షాట్ అయినప్పుడు లైన్ కట్ అయ్యి ఆటో‌పై పడిందని ASPDCL SE నాగరాజు తెలిపారు. దీంట్లో విద్యుత్ శాఖనిర్లక్ష్యం లేదని ఆయన అన్నారు.

ఎక్కడైనా లైన్ కట్ అయితే సబ్ స్టేషన్ ట్రిప్ అవుతుందని.. కానీ ఈ ఘటనలో అది జరగలేదని అన్నారు. శాఖాపరంగా విచారణ జరుపుతున్నామని నాగరాజు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను విచారణ అధికారిగా నియమించినట్లు ఆయన చెప్పారు.

కాగా ఈ ప్రమాద సంఘటన‌లో 5గురు సజీవ దహనం కాగా ముగ్గురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు గుడ్డంపల్లి, పెద్దకోట్ల గ్రామాలకు చెందిన‌ కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, కుమారిగా గుర్తించారు.

మరో వైపు మరణించిన వారి కుటుంబాలకు జగన్ సర్కార్ ఒక్కొక్కరికి పది లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News