కొండా బీజేపీలో చేరడం అభిమానులకు ఇష్టం లేదా?

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్వరలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. జూలై 3న పరేడ్ గ్రౌండ్స్‌లో జ‌ర‌గ‌నున్న బహిరంగ సభలో మోడీ సమక్షంలో ఆయన బీజేపీలో చేరనుండటం దాదాపు ఖాయమైంది. తెలంగాణ బీజేపీ క్యాడర్‌లో ఉత్సాహం నింపి, ఎన్నికలకు సమాయాత్త పరిచేందుకు గాను విజయ్ సంకల్ప్ పేరుతో ఈ సభ నిర్వహిస్తోంది. కాగా, సభకు ప్రధాని మోడీ హాజరవుతుండటంతో ఇతర పార్టీలో నుంచి భారీగా ముఖ్య నేతలను తీసుకొని వచ్చి చేర్పించాలని బీజేపీ భావించింది. […]

Advertisement
Update:2022-06-30 08:56 IST

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్వరలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. జూలై 3న పరేడ్ గ్రౌండ్స్‌లో జ‌ర‌గ‌నున్న బహిరంగ సభలో మోడీ సమక్షంలో ఆయన బీజేపీలో చేరనుండటం దాదాపు ఖాయమైంది.

తెలంగాణ బీజేపీ క్యాడర్‌లో ఉత్సాహం నింపి, ఎన్నికలకు సమాయాత్త పరిచేందుకు గాను విజయ్ సంకల్ప్ పేరుతో ఈ సభ నిర్వహిస్తోంది. కాగా, సభకు ప్రధాని మోడీ హాజరవుతుండటంతో ఇతర పార్టీలో నుంచి భారీగా ముఖ్య నేతలను తీసుకొని వచ్చి చేర్పించాలని బీజేపీ భావించింది. కానీ చివరకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని మాత్రమే పార్టీలోకి తీసుకొని రావడంలో సఫలం అయ్యింది.

తెలంగాణ తొలితరం రాజకీయ నేత, స్వాతంత్ర సమరయోధుడు, ఏపీ డిప్యూటీ సీఎంగా కొండా వెంకట రంగారెడ్డి పనిచేశారు. హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న కేవీ రంగారెడ్డి జిల్లా ఆయన పేరు మీదే ఉన్నది. ఆయన మనుమడే కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

అంతటి ఘనకీర్తి ఉన్న కుటుంబానికి చెందిన విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడాన్ని సన్నిహితులు, కార్యకర్తలు, అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. టీఆర్ఎస్ నుంచి 2014లో చేవెళ్ల ఎంపీగా గెలిచిన ఆయన, 2019లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కేవలం 14 వేల తేడాతో ఓడిపోవడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారని భావించినా.. చివరకు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకొని రావాలని పలువురు సీనియర్ నేతలు ప్రయత్నించారు. అయితే ఆయనకు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్లే ఆయన బీజేపీ బాట పట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అనుచరులు, అభిమానులకు బీజేపీలో చేరడం ఇష్టం లేకపోయినా సముదాయించినట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం లేదని, కాంగ్రెస్‌లో చేరినా తనకు లాభం ఉండదని.. అందుకే బీజేపీలో చేరడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

కాగా, ఎంతో మంది పాపులర్ నాయకులు బీజేపీలో చేరి మసకబారి పోయారని అభిమానులు బాధపడుతున్నారు. ఈటల రాజేందర్ వంటి మాస్ లీడర్ కూడా చివరకు బీజేపీలో నోరు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి ఉందని.. అలాంటప్పుడు ఆ పార్టీలో మనమెందుకు చేరాలని అభిమానులు విశ్వేశ్వర్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అయితే వాళ్లకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే తన నిర్ణయాన్ని చెప్పినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News