గవర్నర్ ఆదేశాన్ని సవాలు చేస్తూ ‘సుప్రీం’లో శివసేన పిటిషన్

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే రేపు అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ జారీ చేసిన ఆదేశాలను శివసేన సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని తెలియజేస్తూ.. గవర్నర్ చర్య కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. మహారాష్ట్రలోని తాజా పరిణామాలపై విచారణను అత్యున్నత న్యాయస్థానం జులై 11 కి వాయిదా వేసిందని, పైగా 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారాన్ని ఈ కోర్టు ఆ తేదీకి వాయిదా వేసినప్పుడు […]

Advertisement
Update:2022-06-29 06:25 IST

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే రేపు అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ జారీ చేసిన ఆదేశాలను శివసేన సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని తెలియజేస్తూ.. గవర్నర్ చర్య కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. మహారాష్ట్రలోని తాజా పరిణామాలపై విచారణను అత్యున్నత న్యాయస్థానం జులై 11 కి వాయిదా వేసిందని, పైగా 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారాన్ని ఈ కోర్టు ఆ తేదీకి వాయిదా వేసినప్పుడు అసెంబ్లీలో బల పరీక్షఎలా నిర్వహిస్తారని చతుర్వేది ప్రశ్నించారు. ఈ ఎమ్మెల్యేల అనర్హత స్టేటస్ ఇంకా నిర్ణయం కాలేదని, వీరు ఫ్లోర్ టెస్ట్ లో ఎలా పాల్గొంటారని అన్నారు. దీంతో బాటు ఇతర అంశాలు కూడా కోర్టు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.

గవర్నర్ చర్యపై శివసేన నేత సంజయ్ రౌత్ కూడా తీవ్రంగా స్పందిస్తూ.. గవర్నర్ నిర్ణయాన్ని తాము సుప్రీంకోర్టులో సవాలు చేస్తామన్నారు. గవర్నర్ చర్య చట్టవ్యతిరేకమని, 16 మంది ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగులో ఉందని ఆయన అన్నారు. బీజేపీ, గవర్నర్ ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే మేం సుప్రీంకోర్టుకెక్కుతాం.. న్యాయం కోరుతాం అని రౌత్ ఆవేశంగా వ్యాఖ్యానించారు. బీజేపీ డిమాండుపై రాజ్ భవన్ ఎంత వేగంగా స్పందించిందంటే ఇది ప్రధాని మోడీ కొనుగోలు చేసిన రఫెల్ జెట్ల విమానం కన్నా స్పీడ్ గా ఉంది అని ఆయన అభివర్ణించారు.

అయితే అసెంబ్లీలో ఎలాంటి బల పరీక్ష జరగకుండా ఆదేశాలివ్వాలంటూ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కోర్టు ఇటీవల తిరస్కరించింది. తాత్కాలిక ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరిస్తూ.. 16 మంది ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై విచారణను జులై 11కి వాయిదా వేసింది. కానీ ఏదైనా చట్టవ్యతిరేక చర్య ఉన్నప్పుడు ప్రభుత్వం ఎప్పుడైనా కోర్టును సంప్రదించవచ్చునని ఇద్దరు జడ్జీలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. అటు రేపు అసెంబ్లీలో సీఎం ఉద్ధవ్ థాక్రే బలపరీక్ష వ్యవహారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా గవర్నర్ ఆదేశించారు. ఇలా ఉండగా ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో గౌహతిలోని హోటల్ లో ఉన్న రెబెల్ సేన ఎమ్మెల్యేలు అక్కడినుంచి గోవాకు తరలి వెళ్లే అవకాశాలున్నాయి. ఇందుకోసం గోవాలోని తాజ్ కన్వెన్షన్ హోటల్ లో 71 గదులు బుక్ చేసినట్టు సమాచారం.

 

 

Tags:    
Advertisement

Similar News