ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల..ఆగస్టు 6న పోలింగ్
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 6వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజున ఓట్లు లెక్కిస్తారని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు. జూలై 5న ఉప రాష్ట్రపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. జూలై 19 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జూలై 20న నామినేషన్లను పరిశీలిస్తారు. జూలై 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజుగా నిర్ణయించారు. ఉప రాష్ట్రపతిని ఎన్నుకొనేందుకు […]
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 6వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజున ఓట్లు లెక్కిస్తారని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు.
జూలై 5న ఉప రాష్ట్రపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. జూలై 19 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జూలై 20న నామినేషన్లను పరిశీలిస్తారు. జూలై 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజుగా నిర్ణయించారు.
ఉప రాష్ట్రపతిని ఎన్నుకొనేందుకు పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన ఎంపీలు ఓటు చేస్తారు. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీతో ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. దీంతో ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, నామినేటేడ్ సభ్యులతో కలిపి ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేస్తారు.
ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరపున ఎవరిని బరిలోకి దించుతాయనే విషయమై ప్రస్తుతం చర్చ సాగుతుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి మరోసారి అవకాశం పొడిగిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే బిజెపీ సీనియర్ నాయకుడు మైనారిటీ వర్గానికి చెందిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీని ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలో నిలపనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అందుకే ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయలేదని చెబుతున్నారు.
మరో వైపు విపక్షాల తరపున ఉప రాష్ట్రపతి పదవికి ఎవరిని బరిలోకి దించుతారో తేలాల్సి ఉంది. ప్రస్తుతం అధికార, విపక్షాలు రాష్ట్రపతి ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టిపెట్టాయి.
ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్ధిగా గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును బరిలోకి దించారు. దీంతో అటు మహిళా కోటాలోనూ, తొలిగిరిజన అభ్యర్ధిగానూ రికార్డు సృష్టించిన పార్టీగా బిజెపి చెప్పుకుంటోంది. విపక్షాల అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ముర్ముతో పోటీ పడుతున్నారు.
జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. జూలై 21న ఓట్ల లెక్కింపును నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. వచ్చే నెల 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది.