కిళ్లీ కట్టే వారిని, రిక్షాతోలే వారిని మంత్రుల్ని చేశాం.. ఇప్పుడు అనుభవిస్తున్నాం..

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు, ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కిళ్లీలు చుట్టేవారిని, రిక్షా కార్మికుల్ని కూడా తాము మంత్రులుగా చేశామన్నారు. తిరుగుబాటు గ్రూప్ కి నాయకుడుగా ఉన్న ఏక్ నాథ్ షిండే గతంలో రిక్షా కార్మికుడు అనే విషయాన్ని పరోక్షంగా గుర్తుచేశారు ఆదిత్య థాక్రే. ఇప్పటి వరకూ ఉద్ధవ్ థాక్రే కూడా ఈ స్థాయిలో రెబల్స్ పై విమర్శలు చేయలేదు. కానీ ఆదిత్య మాత్రం తేనెతుట్టే […]

Advertisement
Update:2022-06-28 06:53 IST

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు, ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కిళ్లీలు చుట్టేవారిని, రిక్షా కార్మికుల్ని కూడా తాము మంత్రులుగా చేశామన్నారు. తిరుగుబాటు గ్రూప్ కి నాయకుడుగా ఉన్న ఏక్ నాథ్ షిండే గతంలో రిక్షా కార్మికుడు అనే విషయాన్ని పరోక్షంగా గుర్తుచేశారు ఆదిత్య థాక్రే.

ఇప్పటి వరకూ ఉద్ధవ్ థాక్రే కూడా ఈ స్థాయిలో రెబల్స్ పై విమర్శలు చేయలేదు. కానీ ఆదిత్య మాత్రం తేనెతుట్టే కదిపారు. సంధికి అవకాశమే లేకుండా వైరి వర్గంపై విరుచుకుపడుతున్నారు.

నమ్మకద్రోహం..
మహా వికాస్ అఘాఢీ పేరుతో కూటమి ఏర్పాటు చేసే సమయంలో కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు తమల్ని మోసం చేస్తారని, తమకి ద్రోహం చేయవచ్చనే అనుమానాలు చాలామంది వ్యక్తం చేశారని, కానీ చివరకు తమ మనుషులే తమకు ద్రోహం చేశారన్నారు ఆదిత్య థాక్రే.

ఆదిత్య వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్రలో సంచలనంగా మారాయి. సంజయ్ రౌత్ వంటి నేతలు రెబల్స్ పై మాటల తూటాలు పేలుస్తున్నా.. ఉద్ధవ్ మాత్రం ఇంకా శాంతిమంత్రం పఠిస్తున్నారు. ఈ దశలో కిళ్లీ కొట్టువాళ్లు, రిక్షా తొక్కేవాళ్లు అంటూ వైరి వర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు ఆదిత్య.

వారు మాతో టచ్ లో ఉన్నారు..
రెబల్స్ గ్రూప్ లో ఉన్న ఎమ్మెల్యేలంతా ఏక్ నాథ్ షిండేతో ఉన్నారనుకుంటే పొరపాటేనంటున్నారు ఆదిత్య థాక్రే. వారిలో చాలామందికి అసంతృప్తి ఉందని, దాదాపు 20మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు ఆదిత్య.

వారందర్నీ గౌహతి నుంచి తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఆ ఎమ్మెల్యేలందర్నీ కిడ్నాప్ చేశారని, వారికి ఇష్టం లేకుండా శిబిరానికి తరలించారని మండిపడ్డారు. అస్సోం నుంచి మహారాష్ట్రకు వారు తిరిగి రాకపోవడానికి కారణం సెక్యూరిటీ కాదని, వారిలో కొంతమంది తమవైపు వచ్చేస్తారన్న భయంతో ఏక్ నాథ్ షిండే.. అక్కడే వారిని బంధించి ఉంచారన్నారు ఆదిత్య. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఏక్ నాథ్ షిండే చేస్తున్న ప్రయత్నం ఫలించదని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News