ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా.. హిమాచల్ విద్యార్థులకు వెరైటీ ఆఫర్..
జూలై-1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలు కూడా స్థానికంగా ఈ నిషేధాన్ని అమలులోకి తెస్తున్నాయి. అయితే పిల్లలలో అవగాహన పెంపొందించేందుకు హిమాచల్ ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లోని స్కూళ్లలో పిల్లలకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని తీసుకొచ్చి స్కూల్ లో జమ చేస్తే, కేజీకి 75 రూపాయలు చెల్లిస్తామని పేర్కొంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్.. […]
జూలై-1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలు కూడా స్థానికంగా ఈ నిషేధాన్ని అమలులోకి తెస్తున్నాయి. అయితే పిల్లలలో అవగాహన పెంపొందించేందుకు హిమాచల్ ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది.
హిమాచల్ ప్రదేశ్ లోని స్కూళ్లలో పిల్లలకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని తీసుకొచ్చి స్కూల్ లో జమ చేస్తే, కేజీకి 75 రూపాయలు చెల్లిస్తామని పేర్కొంది.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్..
ప్లాస్టిక్ ని నిర్మూలించడం అంత తేలికైన పనికాదు. ఎందుకంటే ప్లాస్టిక్ ప్రజల జీవిత్లాలో భాగమైపోయింది. నిద్రలేచింది మొదలు.. టూత్ బ్రష్ తో మొదలుపెడితే, పడుకునే ముందు నీళ్లు తాగే బాటిల్ వరకు.. అన్నీ ప్లాస్టిక్ తో చేసినవే. అయితే ప్లాస్టిక్ వస్తువుల్ని తిరిగి ఉపయోగించుకుంటూ పోతే పర్లేదు. నీళ్లు తాగి బాటిల్ పడేయడం, టిఫిన్ చేసి స్పూన్లు, ప్లేట్లు డస్ట్ బిన్ లో వేయడం.. ఇలాంటి వాటి వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం తీవ్రంగా కలుషితమైపోతుందనేది పర్యావరణ వేత్తల వాదన. అందుకే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.
బై బ్యాక్ ప్లాస్టిక్..
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై కేంద్రం నిషేధం విధించినా.. అధికారుల కళ్లుగప్పి వాటిని మార్కెట్లోకి తరలించేవారు ఉంటారు, వాటిని ఉపయోగించేవారు కూడా ఉంటారు. అయితే విద్యార్థులలో అవగాహన పెంచితే.. వారు అలాంటి వస్తువుల వాడకానికి దూరంగా ఉంటారనేది హిమాచల్ ప్రభుత్వ భావన. అందుకే వారిలో చైతన్యం పెంచేందుకు బై బ్యాక్ ప్లాస్టిక్ అనే ఉద్యమం మొదలు పెట్టింది. ఇంట్లో కనపడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను తీసుకొచ్చి స్కూల్ లో జమ చేయాలని పిలుపునిచ్చారు ఉపాధ్యాయులు. కేజీకి 75 రూపాయల చెల్లిస్తామని చెప్పారు. జూలై-1 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది. కనీసం ఇలాగైనా తల్లిదండ్రులలో మార్పు వస్తుందని, ఏ ఒక్కరి ఇంటిలోనూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువు ఉండదనేది ప్రభుత్వ ఆలోచన.
ఇక వ్యాపార వర్గాలనుంచి కూడా మెల్లమెల్లగా ఇలాంటి ప్లాస్టిక్ వస్తువుల్ని దూరం చేసేలా కఠిన చర్యలకు సిద్ధపడింది ప్రభుత్వం. గతంలో చాలా సార్లు ప్లాస్టిక్ వస్తువుల వాడకంపై అవగాహన కల్పించినా, ఇలా ఏకంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించిన దాఖలాలు లేవు. కనీసం ఇప్పుడైనా వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గుతుందేమో చూడాలి.