అగ్నిపథ్: ఒకవైపు నిరసనలు, మరో వైపు వేలాది అప్లికేషన్లు
ఒకవైపు అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్త నిరసనలు సాగుతుండగానే రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొదలయ్యింది. శుక్రవారం నుంచి ఏయిర్ ఫోర్స్ లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మూడురోజుల్లో 59,960 మంది దరఖాస్తు చేసుకున్నాట్టు అధికారులు చెప్పారు. దరఖాస్తులకు జూలై 5న చివరి తేదీ కావడంతో దరఖాస్తులు లక్షల్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 14న కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించగా ఆర్మీ అభ్యర్థులు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దిగారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ […]
ఒకవైపు అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్త నిరసనలు సాగుతుండగానే రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొదలయ్యింది. శుక్రవారం నుంచి ఏయిర్ ఫోర్స్ లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.
మూడురోజుల్లో 59,960 మంది దరఖాస్తు చేసుకున్నాట్టు అధికారులు చెప్పారు. దరఖాస్తులకు జూలై 5న చివరి తేదీ కావడంతో దరఖాస్తులు లక్షల్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ నెల 14న కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించగా ఆర్మీ అభ్యర్థులు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దిగారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి.
తెలంగాణలో పోలీసు కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మరణించాడు. కోట్లాది రూపాయల రైల్వే ఆస్తులకు నిరసనకారులు నిప్పు పెట్టారు.
నిరసనల్లో పాల్గొన్న వందలాది మంది ప్రస్తుతం కేసులతో జైళ్ళలో ఉన్నారు. ఆర్మీలో చేరి దేశసేవ చేయాలనుకున్న ఆ యువకుల భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్దకమైంది.