19ఏళ్లు శివుడిలా మోడీ భరించారు- అమిత్ షా
గుజరాత్ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. గుజరాత్ అల్లర్లపై విష ప్రచారం చేశారని, కావాలనే నరేంద్రమోడీపై విమర్శలు చేశారన్నారు. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని తేలిందని.. వాటి నుంచి నరేంద్రమోడీ బయటకు వచ్చారని షా వ్యాఖ్యానించారు. న్యాయ విచారణ కొనసాగుతుండడంతో 19 ఏళ్ల పాటు నరేంద్రమోడీ ఈ అసత్య ఆరోపణలను మౌనంగా భరించారన్నారు. మెడీపై ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని.. అంతటి నాయకుడు ఇన్నేళ్ల పాటు ఒక్క […]
గుజరాత్ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. గుజరాత్ అల్లర్లపై విష ప్రచారం చేశారని, కావాలనే నరేంద్రమోడీపై విమర్శలు చేశారన్నారు.
ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని తేలిందని.. వాటి నుంచి నరేంద్రమోడీ బయటకు వచ్చారని షా వ్యాఖ్యానించారు. న్యాయ విచారణ కొనసాగుతుండడంతో 19 ఏళ్ల పాటు నరేంద్రమోడీ ఈ అసత్య ఆరోపణలను మౌనంగా భరించారన్నారు.
మెడీపై ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని.. అంతటి నాయకుడు ఇన్నేళ్ల పాటు ఒక్క మాట మాట్లాడకుండా.. శివుడు తన కంఠంలో విషాన్ని భరించినట్టుగా మోడీ ఈ ఆరోపణలను భరించారని అమిత్ షా చెప్పుకొచ్చారు. నరేంద్రమోడీ పడ్డ బాధను తాను చాలా దగ్గరగా చూశానన్నారు.
ఆనాడు మోడీ సీఎం స్థాయిలో ఉన్నా విచారణకు అన్నివిధాలుగా సహకరించారన్నారు. గుజరాత్ అల్లర్లు ముందస్తు ప్రణాళికతో జరిగినవి కావని కోర్టు కూడా తన తీర్పులో చెప్పిందని గుర్తుచేశారు. సిట్ విచారణను తామెన్నడూ ప్రభావితం చేయలేదన్నారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ దర్యాప్తు జరిగిందన్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ ప్రేరేపిత జర్నలిస్టులు, ఎన్‌జీవోలు ఆ ఆరోపణలను బాగా ప్రచారం చేశారని అమిత్ షా ఆరోపించారు. వారికి ఉన్నప్రచార సామర్థ్యం కారణంగా రానురానూ ప్రతి ఒక్కరూ ఆ ఆరోపణలు నిజం అని నమ్మే పరిస్థితి మొదలైందన్నారు.
రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించిన సమయంలోకాంగ్రెస్ చేసిన ఆందోళనపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. గతంలో మోడీ సిట్ ముందు హాజరైనప్పుడు తామేమీ ఇలాంటి డ్రామాలు చేయలేదన్నారు. విచారణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో ధర్నాలు చేయించలేదన్నారు. గుజరాత్ అల్లర్లలో మోడీకి క్లీన్ చిట్ రావడం శుభపరిణామమన్నారు.