శివసైనికుల ఆగ్రహం.. రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై కొనసాగుతున్న దాడులు

శివసేన రెబల్ ఎమ్మెల్యేల పట్ల శివసైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. నిన్న శివసేన నాయకులను ఉద్దేశించి ఆ పార్టీ అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే భావోద్వేగ ఉపన్యాసం తర్వాత శివసేన కార్యకర్తలు పలు చోట్ల రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడికి దిగారు. ఆ దాడులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. నిన్న ముంబై కుర్లాలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ కార్యాలయంపై దాడి చేసిన శివసేన కార్యకర్తలు ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. రెబల్ వర్గ నాయకుడు […]

Advertisement
Update:2022-06-25 08:00 IST

శివసేన రెబల్ ఎమ్మెల్యేల పట్ల శివసైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. నిన్న శివసేన నాయకులను ఉద్దేశించి ఆ పార్టీ అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే భావోద్వేగ ఉపన్యాసం తర్వాత శివసేన కార్యకర్తలు పలు చోట్ల రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడికి దిగారు. ఆ దాడులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి.

నిన్న ముంబై కుర్లాలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ కార్యాలయంపై దాడి చేసిన శివసేన కార్యకర్తలు ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. రెబల్ వర్గ నాయకుడు ఏకనాథ్ షిండే, ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అహ్మద్‌నగర్‌లోని ఏకనాథ్ షిండే పోస్టర్లపై నల్లు రంగు పూశారు ‘ఏకనాథ్ షిండే హాయ్ హాయ్’ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో చండీవాలిలో శివసేన రెబల్ ఎమ్మెల్యే దిలీప్ లాండే బ్యానర్ చింపేశారు. దిలీప్ లాండే ఏకనాథ్ షిండే వర్గంలో చేరడంపై శివసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజు పూణె లోని శివసేన రెబల్ ఎమ్మెల్యే తానాజీ సావంత్ కార్యాలయంపై దాడి చేసిన శివసైనికులు విధ్వంసం సృష్టించారు.

సేన కార్యకర్తల బృందం సావంత్‌కు చెందిన భైరవనాథ్ షుగర్ వర్క్స్ కార్యాలయంలోకి చొరబడి, అక్కడ కూడా ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. “సావంత్ కార్యాలయంపై దాడి చేయడం ప్రారంభం మాత్రమే, రాబోయే రోజుల్లో ప్రతి ద్రోహి (రెబల్ ఎమ్మెల్యే) కార్యాలయాలు ధ్వంసం కానున్నాయి” అని శివసేన పార్టీ కార్పొరేటర్ విశాల్ ధనవాడే హెచ్చరించారు. సావంత్ ఉస్మానాబాద్ జిల్లాలోని పరండా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మరో వైపు రెబల్ ఎమ్మెల్యేల కు భద్రత ను తొలగించినట్టు వాళ్ళు చేస్తున్న ఆరోపణలను మహా రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఖండించింది.

Tags:    
Advertisement

Similar News