26 నుంచి చెన్నైలో శ‌శిక‌ళ విప్ల‌వ యాత్ర‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత నెచ్చెలి, వి.కె. శ‌శిక‌ళ జూన్ 26వ తేదీ నుంచి విప్లవ యాత్ర (రెవెల్యూష‌న‌రీ టూర్‌) చేప‌ట్ట‌నున్నారు. చెన్నై మ‌హాన‌గ‌ర‌మంతా ఆమె యాత్ర కొన‌సాగ‌నుంది. ఈ యాత్ర‌లో భాగంగా ఆమె చెన్నై అంతటా ప‌ర్య‌టించి.. పలుచోట్ల బ‌హిరంగ‌స‌భ‌లు పెట్టి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌నున్నారు. ఈ మేర‌కు శ‌శిక‌ళ కార్యాల‌యం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. త‌మిళుల‌ హక్కులు -మహిళల గౌరవాన్ని కాపాడటానికి ఒక విప్లవాత్మక యాత్ర‌గా ఇది మారనుందంటూ […]

Advertisement
Update:2022-06-24 10:34 IST

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత నెచ్చెలి, వి.కె. శ‌శిక‌ళ జూన్ 26వ తేదీ నుంచి విప్లవ యాత్ర (రెవెల్యూష‌న‌రీ టూర్‌) చేప‌ట్ట‌నున్నారు. చెన్నై మ‌హాన‌గ‌ర‌మంతా ఆమె యాత్ర కొన‌సాగ‌నుంది. ఈ యాత్ర‌లో భాగంగా ఆమె చెన్నై అంతటా ప‌ర్య‌టించి.. పలుచోట్ల బ‌హిరంగ‌స‌భ‌లు పెట్టి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌నున్నారు. ఈ మేర‌కు శ‌శిక‌ళ కార్యాల‌యం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. త‌మిళుల‌ హక్కులు -మహిళల గౌరవాన్ని కాపాడటానికి ఒక విప్లవాత్మక యాత్ర‌గా ఇది మారనుందంటూ ఆ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.

జూన్ 26వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు శ‌శిక‌ళ‌ టి నగర్ నివాసం నుంచి పర్యటన ప్రారంభమై టి నగర్, కోయంబేడు, పూనమల్లి, తిరుత్తణి, కోరమంగళ, కెజి సందిగైమ్ ఎస్‌విజి పురం, కృష్ణకుప్పం, ఆర్‌కె పెట్టయాలో పర్యటించి తిరిగి తన నివాసానికి చేరుకుంటారు. పార్టీ అగ్రనేతలు ఎంజీ రామచంద్రన్‌, జయలలితలను ప్ర‌జ‌ల్లోకి మ‌రోసారి తీసుకెళ్ల‌డ‌మే ఈ యాత్ర ఉద్దేశ‌మ‌ని శ‌శిక‌ళ చెబుతోంది.

అన్నాడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామి, ఓ పన్నీర్‌సెల్వం మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న తరుణంలో శశికళ ఈ యాత్రను ప్రారంభించారు. గ‌త నెల‌ 25న శశికళ మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వస్తానని సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో AIADMK ప్రతిపక్ష పార్టీగా సరిగ్గా పనిచేయడం లేదని, అన్నాడీఎంకేతో అమ్మ పాలన త్వరలో తిరిగి వస్తుందని ఆమె అన్నారు.

Tags:    
Advertisement

Similar News