మా ఎమ్మెల్యేలను బీజేపీ బంధించింది : సంజయ్ రౌత్
మహారాష్ట్ర లో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తనకు 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తిరుగుబాటు నేత ఏక్ నాధ్ షిండే చెబుతున్నారు. శివసేనకు ఉన్న 55 మంది ఎమ్మెల్యేలలో 13 మంది మినహా మిగిలిన వారంతా తన వెంటే ఉన్నారని చెబుతున్నారు. 35 మంది ఎమ్మెల్యేలు షిండేతో ఉన్నట్టు తెలుస్తోంది. మరో ముగ్గురు కూడా ఆయన చెంతకు చేరారనే వార్తలు వస్తున్నాయి. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు షిండే గట్టిగా ప్రత్నాలు చేస్తున్నారు. అందుకు కనీసం […]
మహారాష్ట్ర లో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తనకు 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తిరుగుబాటు నేత ఏక్ నాధ్ షిండే చెబుతున్నారు. శివసేనకు ఉన్న 55 మంది ఎమ్మెల్యేలలో 13 మంది మినహా మిగిలిన వారంతా తన వెంటే ఉన్నారని చెబుతున్నారు. 35 మంది ఎమ్మెల్యేలు షిండేతో ఉన్నట్టు తెలుస్తోంది. మరో ముగ్గురు కూడా ఆయన చెంతకు చేరారనే వార్తలు వస్తున్నాయి. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు షిండే గట్టిగా ప్రత్నాలు చేస్తున్నారు. అందుకు కనీసం అవసరమైన 37 మంది ఎమ్మెల్యేలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియలో బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
మరో వైపు పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ కీలకవ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను బంధించిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బలవంతంగా ఎమ్మెల్యేలను ఒప్పిస్తున్నారని ఆరోపించారు. షిండే శిబిరంలో ఉన్నవారు ఇప్పటికీ తమతో టచ్ లోనే ఉన్నారన్నారు. తమవద్ద 20 మంది ఎమ్మెలేలు ఉన్నారు ఆ శిబిరం నుంచి మరికొందరు ఠాక్రేకు మద్దతుగా నిలుస్తారు. అవసరమైన సమయంలో వారంతా ముందుకు వచ్చి ఠాక్రేకు అండగా నిలబడతారన్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదు. తిరుగుబాటుదార్లపై అతి త్వరలో చర్యలు తీసుకుంటాం అని సంజయ్‌రౌత్ అన్నారు.
రాజకీయ పరిణామాలపై తమ నాయకులతో చర్చించేందుకు ఎన్సీపి నేత శరద్ పవార్ సమావేశం కానున్నారు. శివసేన అధినేత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా తమ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. బహుశా ఈ సమావేశంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.