అందుకే తిరుగుబాటు చేశాం.. శివ‌సేన రెబెల్ ఎమ్మెల్యేలు

శివసేన నాయకత్వంపై తమకు ఎటువంటి ఫిర్యాదులు లేవని, అయితే ఎన్‌సిపి, కాంగ్రెస్ పనితీరుతోనే కలత చెందామ‌ని ఏక్ నాథ్‌షిండే శిబిరంలోని అస‌మ్మ‌తి ఎమ్మెల్యేలు బెబుతున్నారు‌. బుధ‌వారంనాడు వారంతా గుజ‌రాత్ నుంచి గౌహ‌తికి చేరుకున్న విష‌యం తెలిసిందే. మ‌హా రాష్ట్ర‌లో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల‌తో క‌లిసి మ‌హా వికాస్ అఘాడీ (ఎంవిఎ) పేరుతో శివ‌సేన సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ నాయకుడు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో కొంద‌రు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగ‌రేశారు. […]

Advertisement
Update:2022-06-22 07:01 IST

శివసేన నాయకత్వంపై తమకు ఎటువంటి ఫిర్యాదులు లేవని, అయితే ఎన్‌సిపి, కాంగ్రెస్ పనితీరుతోనే కలత చెందామ‌ని ఏక్ నాథ్‌షిండే శిబిరంలోని అస‌మ్మ‌తి ఎమ్మెల్యేలు బెబుతున్నారు‌. బుధ‌వారంనాడు వారంతా గుజ‌రాత్ నుంచి గౌహ‌తికి చేరుకున్న విష‌యం తెలిసిందే. మ‌హా రాష్ట్ర‌లో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల‌తో క‌లిసి మ‌హా వికాస్ అఘాడీ (ఎంవిఎ) పేరుతో శివ‌సేన సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ నాయకుడు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో కొంద‌రు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగ‌రేశారు. అసమ్మతివాదులలో ఉన్న మహారాష్ట్ర శివసేన మంత్రి సందీపన్ భూమారే బుధవారం మాట్లాడారు.

మంత్రి సందీపన్ భూమారే ఫోన్‌లో మాట్లాడుతూ, “శివసేన నాయకత్వంపై మాకు ఎటువంటి ఫిర్యాదులు లేవు. మేము ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో మా స‌మ‌స్య‌ల‌ను వివ‌రించాం. ఎన్సీపీ, కాంగ్రెస్ మంత్రుల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం మాకు చాలా క‌ష్టంగా మారింది. మా ప్ర‌తిపాద‌న‌లు ఆ పార్టీల మంత్రుల నుంచి ఎటువంటి ఆమోదం పొంద‌లేక‌పోతున్నాయి. ఈ ప‌రిస్థితి మాకు చాలా క‌ష్టంగా ఉంటోంది” అని చెప్పారు.

తనకు కేబినెట్ పోర్ట్‌ఫోలియో ఇచ్చారని, దానితో సంతృప్తి చెందాన‌ని చెప్పారు. “ఒక ప్ర‌జా ప్ర‌తినిధిగా నాకు ఇంత‌కంటే ఏం కావాలి. అయితే కాంగ్రెస్‌, ఎన్సీపీ ల‌కు చెందిన మంత్రుల తీరు వ‌ల్ల నా ప్ర‌జ‌ల బాధలను తీర్చ‌లేక‌పోతున్నాని” అన్నారాయన.

శివ‌సేన అసమ్మతి ఎమ్మెల్యే సంజయ్ శిర్సాత్ మాట్లాడుతూ 35 మంది పార్టీ శాసనసభ్యులు గౌహతిలో ఉన్నారని చెప్పారు. “ఈరోజు సాయంత్రంలోగా మరికొందరు ఎమ్మెల్యేలు మాతో చేరనున్నారు. మాకు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని” ఆయన పేర్కొన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్ మంత్రులు త‌మ‌ను శ‌త్రువులుగా చూస్తున్నార‌ని మండిప‌డ్డారు. వారి వైఖ‌రి వ‌ల్లే తిరుగుబాటు చేయాల్సి వ‌చ్చింద‌న్నారు.

Tags:    
Advertisement

Similar News