మహారాష్ట్ర సంక్షోభం – శివసేనలో రెబల్స్ కథ
శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు అస్సోం రాజధాని గువాహటిలో మకాం వేశారు. తమకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామాలతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వ భవిష్యత్తు అనిశ్చితిలో పడినట్టు కనబడుతోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సన్నిహితుడు ఏక్ నాథ్ షిండే, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్‌లతో కలిసి తిరుగుబాటుకు ప్రణాళిక రచించారని […]
శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు అస్సోం రాజధాని గువాహటిలో మకాం వేశారు. తమకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామాలతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వ భవిష్యత్తు అనిశ్చితిలో పడినట్టు కనబడుతోంది.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సన్నిహితుడు ఏక్ నాథ్ షిండే, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్‌లతో కలిసి తిరుగుబాటుకు ప్రణాళిక రచించారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 30 మందికి పైగా శివసేన ఎమ్మెల్యేలు అజ్ఞాతంలో ఉన్నందున ప్రభుత్వం డోలాయమానంలో పడింది. కార్టూనిస్ట్ బాల్ థాకరే శివసేన పేరుతో పార్టీని స్థాపించారు. ఈ పార్టీ మితవాద పార్టీగా పేరొందింది.
తిరుగుబాట్లకు ఆద్యుడు చగన్ భుజబల్
ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆహార ,పౌర సరఫరాల వ్యవహారాలశాఖ కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్న ఛగన్ భుజబల్ శివసేనలో తిరుగుబాదారులలో ఒకడు. మజాగాన్ నుండి ఎమ్మెల్యేగా ఉన్న భుజబల్ , 52 మంది పార్టీ శాసనసభ్యులలో 17 మంది శివసేన (బి) ఏర్పాటుకు మద్దతు ఉందని ప్రకటించారు. ఆయన సంకీర్ణ కూటమిలో భాగమైన కాంగ్రెస్ నేత (ప్రస్తుతం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపీ) అధినేత) శరద్ పవార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. పవార్ హయాంలో భుజబల్ ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులు చేపట్టారు. ఓబిసి వర్గాల్లో బలవంతుడుగా భుజబల్ కు పేరుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మనోహర్ జోషిని థాక్రే నియమించడంతో బాల్ థాక్రేతో విభేదించారు.
రాజ్ థాక్రే ..
అయితే, శివసేనలో ప్రజాస్వామ్యం లోపించిందని విమర్శిస్తూ 2005లో బాల్ థాక్రే సమీప బంధువు రాజ్ థాక్రే పార్టీని విడిచిపెట్టాడు. ఈ పరిణామంతో శివసేనకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఆయన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పేరుతో తన సొంత పార్టీని స్థాపించారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో (ఎంఎన్ఎస్) గేమ్ ఛేంజర్‌గా మారింది.
2009లో 288 మంది సభ్యుల మహారాష్ట్ర శాసనసభలో కొత్తగా ఏర్పడిన ఎంఎన్ఎస్ పార్టీ 13 స్థానాలను గెలుచుకోవడంతో రాజకీయంగా ఆయనకు ఎంతో బలాన్నిఇచ్చింది. అయితే ఆ తర్వాత నుంచి క్రమంగా పార్టీ తిరోగమన దిశగా సాగింది. చివరికి 2019 అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. కారణంగా పార్టీ అధోముఖంగా ఉంది. రాజ్‌థాక్రేకు స్పష్టమైన ఎజెండా లేకపోవడం, అందుబాటులో ఉండడనే అపవాదు తో పాటు ఉద్ధవ్ థాక్రేకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు అతని ఇమేజ్‌ను నిలబెట్టుకోవడంలో పెద్దగా సహాయపడలేదు.
నారాయణ్ రాణే ..
శాఖా-ప్రముఖుడుగా పేరుగాంచిన నారాయణ్ రాణే శివసేన నుండి బయటికివెళ్ళడం ఆశ్చర్యకరమైన నిష్క్రమణలలో ఒకటి. తొలిసారిగా 1999లో శివసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎనిమిది నెలల పాటు ప్రభుత్వంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈస్థాయికి చేరుకున్నారు.
2003లో ఉద్ధవ్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించినప్పుడు ఆయన నాయకత్వాన్ని సవాలు చేసినందుకు 2005లో రాణేను పార్టీ నుంచి బహిష్కరించారు. శివసేనలో టిక్కెట్లు, పదవులను అభ్యర్థులకు అమ్ముకున్నారని ఆరోపించడంతో ఆయన ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు’ పాల్పడ్డారని బహిష్కరణ వేటు వేశారు.. మరికొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. 2017లో తనకు సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చారని రాణే, కాంగ్రెస్‌లో అవకాశం లేదని పేర్కొంటూ కాంగ్రెస్‌ను వీడి, మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష్ అనే తన సొంత పార్టీని స్థాపించారు. ఆ పార్టీని 2019లో బీజేపీలో విలీనం చేసి రాజ్యసభకు ఎన్నికయ్యారు.