ఆఫ్ఘనిస్తాన్ భూకంపం, వేయికి చేరిన మృతుల సంఖ్య‌!

ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూ ఉంది. ఈ ఉదయం 200 మందిమరణించారని భావించగా ప్రస్తుతం వేయిమందికి పైగా చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. 1500 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పక్టికా ప్రావిన్స్ లో సంభవించిన ఈ భూకంపంలో అనేక ఇళ్ళు నేలమట్టమయ్యాయి. ఈ తెల్లవారుజామున 2.44కు 6.1 తీవ్రతతో భూకంపం రావడంతో ఇళ్లు కూలి శిథిలాలు పడి నిద్రలోనే చాలా మంది మరణించారు. ఇప్పటికే 1000 మృతదేహాలు వెలికితీశారు. […]

Advertisement
Update:2022-06-22 12:00 IST

ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూ ఉంది. ఈ ఉదయం 200 మందిమరణించారని భావించగా ప్రస్తుతం వేయిమందికి పైగా చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. 1500 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

పక్టికా ప్రావిన్స్ లో సంభవించిన ఈ భూకంపంలో అనేక ఇళ్ళు నేలమట్టమయ్యాయి. ఈ తెల్లవారుజామున 2.44కు 6.1 తీవ్రతతో భూకంపం రావడంతో ఇళ్లు కూలి శిథిలాలు పడి నిద్రలోనే చాలా మంది మరణించారు. ఇప్పటికే 1000 మృతదేహాలు వెలికితీశారు. శిథిలాల తొలగింపు పూర్తయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ ఘటనలో 100కు పైగా భవనాలు నేలమట్టం అయ్యాయి. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. భూప్రకంపనలు 500 చదరపు కిలోమీటర్ల వరకూ కనిపించినట్టు సమాచారం.

మట్టితో చేసిన నివాసాలు ఉన్న హిందూకుష్ రీజియన్ లోనే ఈ భూకంపం సంభవించింది. దీంతో అక్కడ ఇళ్లు అన్నీ కుప్పకూలిపోయాయి. అప్ఘనిస్తాన్ లో భూకంపాలు సంబవించడం సాధారణమే అయినా ఈ స్థాయిలో ప్రాణాలు తీసిన ఘటనలు చాలా తక్కువ. హిందుకుష్ మౌంటెయిన్ రీజియన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తాయని అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది.

తాలిబన్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. పెద్ద ఎత్తున హెలిక్యాప్టర్లను వినియోగించి క్షతగాత్రులను కాబుల్ కాందహార్ వంటి నగరాల్లోని ఆస్పత్రులకు తరలిస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో మరిన్ని చర్యలు చేపడుతోంది. గయాన్ జిల్లాలోని బర్మాలా జిరుక్ నాకా పట్టణాలపై భూకంపం తీవ్రత పెద్ద ఎత్తున పడిందని,అక్కడ‌ మృతుల సంఖ్య‌ భారీగా ఉన్నట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News