ప్రధాని మోడీ ఫ్రెండ్ అబ్బాస్ ఎక్కడున్నారో తెలిసింది

ప్రధాని మోడీ చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్ ఎక్కడున్నారో తెలిసిపోయింది. ఆయన ఎక్కడున్నారో చెబితే.. మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు కరెక్టా.. కాదా అని ఆయన్నే అడుగుతామని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. మోడీనుద్దేశించి నిన్న ట్వీట్ చేశారు. మొత్తానికి అబ్బాస్ ఆస్ట్రేలియాలో తన కొడుకుతో కలిసి హాయిగా రిటైర్మెంట్ లైఫ్ గడుపుతున్నారట. ఆయన పూర్తి పేరు అబ్బాస్ రాంసాద .. సిడ్నీలో ఆయన నిశ్చింతగా కాలం వెళ్లదీస్తున్నారని మోడీ సోదరుడు (తమ్ముడు) ప్రహ్లాద్ […]

Advertisement
Update:2022-06-21 03:56 IST

ప్రధాని మోడీ చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్ ఎక్కడున్నారో తెలిసిపోయింది. ఆయన ఎక్కడున్నారో చెబితే.. మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు కరెక్టా.. కాదా అని ఆయన్నే అడుగుతామని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. మోడీనుద్దేశించి నిన్న ట్వీట్ చేశారు. మొత్తానికి అబ్బాస్ ఆస్ట్రేలియాలో తన కొడుకుతో కలిసి హాయిగా రిటైర్మెంట్ లైఫ్ గడుపుతున్నారట. ఆయన పూర్తి పేరు అబ్బాస్ రాంసాద .. సిడ్నీలో ఆయన నిశ్చింతగా కాలం వెళ్లదీస్తున్నారని మోడీ సోదరుడు (తమ్ముడు) ప్రహ్లాద్ మోడీ తెలిపారు.

తన తల్లి హీరాబెన్ మోడీ 100వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా మోడీ ఆమె ఆశీస్సులు తీసుకునేందుకు గుజరాత్ వెళ్ళినప్పుడు తన బ్లాగ్ పోస్టులో అబ్బాస్ గురించి కూడా గుర్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ అబ్బాస్ గురించిన పూర్తి వివరాలు తెలిశాయి. లోగడ ఆయన తమ కుటుంబంలో ఓ భాగమైపోయారని, 1970 ప్రాంతంలో నాలుగేళ్లపాటు తమ ఫ్యామిలీతో కలిసి ఉన్నారని ప్రహ్లాద్ మోడీ చెప్పారు. తన సోదరుడు ఈ దేశ ప్రధాని అయినా.. ఈయన గుజరాత్ రేషన్ షాపు యజమానుల సంఘానికి అధ్యక్షునిగా ఉండడం విశేషం.

మెహసానా జిల్లాలోని వాద్ నగర్ టౌన్ దగ్గరి కెసింపా అనే గ్రామంలో ఉంటూ వచ్చిన అబ్బాస్ రాంసాద.. వాద్ నగర్ లో తన మరో సోదరుడు పంకజ్ మోడీతో కలిసి చదువుకున్నారని ప్రహ్లాద్ తెలిపారు. తన తండ్రి అకాల మరణంతో ఇక మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పాలని అబ్బాస్ ఆవేదనతో ఉండగా.. తమ తండ్రి అతడిని ఇంటికి తీసుకువచ్చి అతని చదువు కొనసాగేలా చూశారని ఆయన తెలిపాడు. అలా నాలుగేళ్లపాటు అబ్బాస్ మోడీ కుటుంబంలో ఒకరిగా మారిపోయాడు. ముస్లిం అయిన అతడి మతాచారాలకు తమ కుటుంబం అడ్డు చెప్పలేదని, తమ ఇంట్లో అతడు నమాజ్ వంటివి చేసుకోవచ్చునని తమ తండ్రి అతనికి స్వేచ్ఛ నిచ్చారని ఆయన వెల్లడించారు.

ఇది మతసామరస్యానికి చిహ్నం.. మాకు అబ్బాస్ సోదరుడిలా ఉండేవారు.. తరువాత ప్రభుత్వ ఉద్యోగం వచ్చి స్థిరపడ్డారు. కొన్ని సంవత్సరాల క్రితం గుజరాత్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మేనేజరుగా పని చేసి రిటైరయ్యారు. ఇప్పుడు తన కొడుకులతో కలిసి సిడ్నీలో ఉంటున్నారు అని ప్రహ్లాద్ మోడీ వివరించారు. ఇలా అబ్బాస్ గురించిన అన్నీ తెలిశాయి గనుక అసదుద్దీన్ ఒవైసీ ఏం చేస్తారో చూడాలి.. ఆస్ట్రేలియా వెళ్లి ఆయనను కలుసుకుంటారా? లెటజ్ వెయిట్ అండ్ సీ !

Tags:    
Advertisement

Similar News