అగ్నిపథ్ పై మోదీ పరోక్ష స్పందన.. ఏమన్నారంటే..?

దేశమంతా అగ్నిపథ్ ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న వేళ.. ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. సంస్కరణలు తాత్కాలికంగా నచ్చకపోయినా.. కాలం గడిచే కొద్దీ వాటి లాభాలను దేశం అందుకుంటుందని చెప్పారు మోదీ. కొన్ని నిర్ణయాలు అన్యాయంగా అనిపించినా దేశ నిర్మాణానికి ముఖ్యమైనవిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కర్నాటక పర్యటనలో బిజీగా ఉన్న ప్రధాని మోదీ.. మైసూరులోని ఆలిండియా ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్‌ సెంటర్లో కొత్త కోచింగ్ టెర్మినల్ కు శంకుస్థాపన చేశారు. భారత దేశానికి సంబంధించి […]

Advertisement
Update:2022-06-21 02:16 IST

దేశమంతా అగ్నిపథ్ ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న వేళ.. ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. సంస్కరణలు తాత్కాలికంగా నచ్చకపోయినా.. కాలం గడిచే కొద్దీ వాటి లాభాలను దేశం అందుకుంటుందని చెప్పారు మోదీ. కొన్ని నిర్ణయాలు అన్యాయంగా అనిపించినా దేశ నిర్మాణానికి ముఖ్యమైనవిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

కర్నాటక పర్యటనలో బిజీగా ఉన్న ప్రధాని మోదీ.. మైసూరులోని ఆలిండియా ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్‌ సెంటర్లో కొత్త కోచింగ్ టెర్మినల్ కు శంకుస్థాపన చేశారు. భారత దేశానికి సంబంధించి ఈ శతాబ్దం.. సంపద, ఉద్యోగాల సృష్టికర్తలదేనన్నారు మోదీ. కొత్త కొత్త ఆలోచనలు కలిగినవారికి ఇది సొంతం అని, ప్రపంచంలో అత్యధిక యువత మనదేశంలో ఉండటమే.. భారత్‌ శక్తి, సంపదగా పేర్కొన్నారాయన. ఎనిమిదేళ్లుగా కొత్త ఆలోచనలతో పనిచేయడమనేది అంత సులభంగా జరగలేదని చెప్పారు మోదీ. కొన్ని నిర్ణయాలు, సంస్కరణలు తాత్కాలికంగా నచ్చకపోవచ్చు కానీ, దీర్ఘకాలంలో వాటి లాభాలను దేశం అందుకుంటుందని, సంస్కరణల మార్గమే మనల్ని కొత్త సంకల్పాలు, కొత్త లక్ష్యాల వైపు తీసుకెళ్తుందని వెల్లడించారు.

త్రివిధ‌ దళాధిపతులతో నేడు మోదీ భేటీ..

మరోవైపు అగ్నిపథ్ పై ప్రభుత్వం తగ్గేది లేదని ఈపాటికే స్పష్టం చేసింది. ప్రతిపక్షాల విమర్శలు, యువత ఆందోళనల మధ్య కొన్ని వెసులుబాట్లు మాత్రమే ఇచ్చారు. అగ్నివీర్ ల రిక్రూట్ మెంట్ కోసం త్రివిధ దళాలనుంచి నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ లలో దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకం కింద మొత్తం 83 ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు జరుగుతాయని తెలిపారు అధికారులు. అగ్నిపథ్‌ పై ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ఓ దఫా సమావేశం నిర్వహించగా.. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా రంగంలోకి దిగారు. ఈరోజు ఆయన త్రివిధ దళాధిపతులతో సమావేశం అవుతారు.

Tags:    
Advertisement

Similar News