బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ తరపున పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ తన అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్, గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ముని బరిలోకి దింపింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. అంతకుముందు, రాష్ట్రపతి అభ్యర్థి పేరుపై మేధోమథనం చేయడానికి బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ […]

Advertisement
Update:2022-06-21 16:14 IST

భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ తరపున పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ తన అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్, గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ముని బరిలోకి దింపింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు.

అంతకుముందు, రాష్ట్రపతి అభ్యర్థి పేరుపై మేధోమథనం చేయడానికి బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల‌ ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు జూన్ 29 చివరి తేదీ.

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కు ఒడిశాలోని బీజేడీ, ఏపీలోని వైఎస్సార్ సీపీ ల మద్దతు లభిస్తే ద్రౌపతి ముర్ము గెలుపు సులభమే అని భావిస్తున్నారు

Tags:    
Advertisement

Similar News