అగ్నిపథ్: మా వాదనలు వినకుండా తీర్పు ఇవ్వొద్దు…సుప్రీంకోర్టుకు కేంద్రం వినతి

‘అగ్నిపథ్‘ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు కోర్టు తన వాదనలు తప్పక వినాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. సాయుధ బలగాల కోసం కేంద్రం రూపొందించిన స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్ పథక‍ం అయిన ‘అగ్నిపథ్’పై ఇప్పటివరకు సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. తమ వాదనలు వినకుండానే తమకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఎటువంటి ప్రతికూల ఉత్తర్వులు జారీ చేయకుండా చూసుకోవడానికి కేంద్రం ఈ కేవియట్ దాఖలు చేసింది. ‘అగ్నిపథ్’ పథకాన్ని […]

Advertisement
Update:2022-06-21 07:10 IST

అగ్నిపథ్‘ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు కోర్టు తన వాదనలు తప్పక వినాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది.

సాయుధ బలగాల కోసం కేంద్రం రూపొందించిన స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్ పథక‍ం అయిన ‘అగ్నిపథ్’పై ఇప్పటివరకు సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.

తమ వాదనలు వినకుండానే తమకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఎటువంటి ప్రతికూల ఉత్తర్వులు జారీ చేయకుండా చూసుకోవడానికి కేంద్రం ఈ కేవియట్ దాఖలు చేసింది.

‘అగ్నిపథ్’ పథకాన్ని పునఃపరిశీలించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది హర్ష్ అజయ్ సింగ్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పథకం ప్రకటన తర్వాత దేశంలోని అనేక‌ ప్రాంతాల్లో నిరసనలు పెల్లుబికాయని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

గతంలో ఈ పథకంపై న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ కూడా సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా, పార్లమెంటు ఆమోదం లేకుండా శతాబ్దాల నాటి సాయుధ దళాల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసిందని న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

గత వారం, న్యాయవాది విశాల్ తివారీ తన పిటిషన్‌లో ఈ పథకం వల్ల‌ జాతీయ భద్రతపై, సైన్యంపై ప్రభావాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రజా ఆస్తుల విధ్వంసానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.

జూన్ 14న కేంద్రం ‘అగ్నిపథ్’ పథకాన్ని ప్రకటించిన తర్వాత అనేక రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. పలు చోట్ల హింస చెలరేగి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి దారితీసింది.

అనేక ప్రతిపక్ష పార్టీలు, కొంతమంది మాజీ సైనిక అధికారులు ఈ పథకాన్ని విమర్శించారు. నాలుగేళ్ల పదవీకాలం అనేది సైనికుల పోరాట స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, దేశభద్రతకు ప్రమాదం సంభవిస్తుందని వారు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News