బిచ్చమెత్తుకునే పిల్లవాడు 10th లో ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు

రోడ్లపై బిచ్చమెత్తుకునే ఓ బాలుడు 10వ తరగతి పరీక్షలో మొదటి డివిజన్‌తో ఉత్తీర్ణుడయ్యాడు. ఇప్పుడు ఆర్మీలో చేరాలని ఆకాంక్షిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్, ఆగ్రాలో సదర్ ప్రాంతంలోని మురికివాడలో నివసించే షేర్ అలీ కుటుంబం పేదరికంతో బిచ్చమెత్తుకొని జీవిస్తుంది. ఈ బాలుడు కూడా చాలా కాలం బిచ్చమెత్తుకునేవాడు. అయితే నరేష్ అనే బాలల హక్కుల కార్యకర్త షేర్ అలీను చూసి అతన్ని పాఠాశాలలో చేర్పించాడు. చదువులో అద్భుతంగా రాణించిన అలీ 10 వ తర‌గతిలో 63 శాతం మార్కులతో మొదటి […]

Advertisement
Update:2022-06-20 12:02 IST

రోడ్లపై బిచ్చమెత్తుకునే ఓ బాలుడు 10వ తరగతి పరీక్షలో మొదటి డివిజన్‌తో ఉత్తీర్ణుడయ్యాడు. ఇప్పుడు ఆర్మీలో చేరాలని ఆకాంక్షిస్తున్నాడు.

ఉత్తరప్రదేశ్, ఆగ్రాలో సదర్ ప్రాంతంలోని మురికివాడలో నివసించే షేర్ అలీ కుటుంబం పేదరికంతో బిచ్చమెత్తుకొని జీవిస్తుంది. ఈ బాలుడు కూడా చాలా కాలం బిచ్చమెత్తుకునేవాడు. అయితే నరేష్ అనే బాలల హక్కుల కార్యకర్త షేర్ అలీను చూసి అతన్ని పాఠాశాలలో చేర్పించాడు. చదువులో అద్భుతంగా రాణించిన అలీ 10 వ తర‌గతిలో 63 శాతం మార్కులతో మొదటి డివిజన్ లో పాసయ్యాడు. అతనికి ఇంగ్లీష్ లో 80 మార్కులొచ్చాయి.

ఇంకా పై చదువులు చదవడమంటే ఆ బాలుడికి కష్టమే. అందువల్ల ఆ బాలుడు అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీలో చేరాలనుకుంటున్నాడు. అత్యంత పేదరికంలో పెరిగిన అలీకి, ఈ పథకం మెరుగైన జీవితానికి దారిలా కనిపిస్తోంది.

“నా 10వ తరగతి ఫలితాలు నాకు ఉన్నత లక్ష్యాలను సాధించగలన‌నే విశ్వాసాన్ని ఇచ్చాయి. నేను ఇప్పుడు అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో చేరి భారతదేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నాను” అని అతను చెప్పాడు.

అతన్ని పాఠాశాలలో చేర్చిన బాలల హక్కుల కార్యకర్త నరేష్ మాట్లాడుతూ… ”అలీ ఒక్క చదువులోనే కాదు, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్‌తో సహా రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడా ఈవెంట్లలో అనేక పతకాలను గెలుచుకున్నాడు” అని చెప్పారు. “అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, నేను అతన్ని థియేటర్, డ్యాన్స్‌కు కూడా పరిచయం చేసాను. తాజ్ మహోత్సవ్ వంటి ఆగ్రాలోని ప్రధాన ఈవెంట్లలో అలీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్నాడు. అని నరేష్ చెప్పాడు.

Tags:    
Advertisement

Similar News