మోడీపైకి 50వేల మంది మహిళల లేఖాస్త్రాలు
నరేంద్ర మోడీ ప్రచార మాయాజాలం ఎలాంటిదంటే.. గుజరాత్ అభివృద్ధి, పరిపాలన విమర్శకు అతీతమేమో అని సామాన్యులు భ్రాంతిలో ఉండే పరిస్థితి. అక్కడ పేదలుండరేమో.. స్లమ్ ఏరియాలు లేవేమో.. ప్రజలంతా నిరంతరం ఆనందంతో కేరింతలు కొడుతుంటారేమో అని బయటి ప్రపంచం భావించే స్థాయిలో నరేంద్రమోడీ తన ప్రచారంతో భ్రమపెట్టారు.వైబ్రేటింగ్ గుజరాత్ అంటూ మొదలుపెట్టి ఆ ప్రచార వైబ్రేషన్లతోనే సీఎం టూ పీఎం అయిపోయారు. కానీ గుజరాత్‌లో సామాన్యుల బతుకుచిత్రం వాస్తవ పరిస్థితి వేరు. తాగేందుకు మంచినీరు కూడా లేని […]
నరేంద్ర మోడీ ప్రచార మాయాజాలం ఎలాంటిదంటే.. గుజరాత్ అభివృద్ధి, పరిపాలన విమర్శకు అతీతమేమో అని సామాన్యులు భ్రాంతిలో ఉండే పరిస్థితి. అక్కడ పేదలుండరేమో.. స్లమ్ ఏరియాలు లేవేమో.. ప్రజలంతా నిరంతరం ఆనందంతో కేరింతలు కొడుతుంటారేమో అని బయటి ప్రపంచం భావించే స్థాయిలో నరేంద్రమోడీ తన ప్రచారంతో భ్రమపెట్టారు.వైబ్రేటింగ్ గుజరాత్ అంటూ మొదలుపెట్టి ఆ ప్రచార వైబ్రేషన్లతోనే సీఎం టూ పీఎం అయిపోయారు.
కానీ గుజరాత్‌లో సామాన్యుల బతుకుచిత్రం వాస్తవ పరిస్థితి వేరు. తాగేందుకు మంచినీరు కూడా లేని గ్రామాలు వేలల్లో ఉన్నాయి. ఇందుకు అద్దంపట్టేలా గుజరాత్‌లోని 50వేల మంది మహిళలు నేరుగా ప్రధాని నరేంద్రమోడీకే లేఖలు రాశారు. మీకు ఏదైనా సమస్య ఉంటే ఒక్క పోస్టు కార్డు రాయండి.. మీకు అన్నగా వచ్చి సమస్యను పరిష్కరిస్తానని మోడీ చెప్పిన మాటను మహిళలు వాడుకుంటున్నారు.
వడ్గావ్ నియోజకవర్గంలోని 50వేల మంది మహిళలు తాగు నీటి సదుపాయం కోసం ఎదురుచూసి, ఎదురుచూసి అలసిపోయి ఆదివారం మూకుమ్మడిగా ప్రధానిపైకి లేఖలు సంధించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా గుజరాత్ బీజేపీ ఏలుబడిలోనే ఉన్న విషయాన్ని లేఖలో వారు ప్రముఖంగా ప్రస్తావించారు. 13ఏళ్ల పాటు మీరూ ముఖ్యమంత్రిగా చేశారని నరేంద్రమోడీకి గుర్తు చేశారు.
కానీ ఇప్పటికీ తమ నియోజకవర్గంలో నీటి సమస్యను పరిష్కరించలేదని, ఎండాకాలం వస్తే భయపడాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన చెందారు. వచ్చే ఎండాకాలం నాటికైనా తమను నీటి గండం నుంచి గట్టెక్కించాలని వారు లేఖల్లో విజ్ఞప్తి చేశారు. నర్మదా నది నుంచి నీటిని లిప్ట్ చేసి నియోజకవర్గంలోని కర్మవాద్ సదస్సు, ముక్తేశ్వర్ రిజర్వాయర్‌ను నింపాలని దశాబ్దాలుగా ప్రజలు కోరుతున్నారు. ఇందుకు 500 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఈ మొత్తాన్ని కూడా ఖర్చు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదేనా గుజరాత్ మోడల్ అభివృద్ది అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వడ్గాన్ నియోజకవర్గంలోని 125 గ్రామాలు తీవ్ర నీటి సమస్యలతో అల్లాడుతున్నాయి. తమ లేఖలకు స్పందించకపోతే త్వరలోనే బీజేపీ సర్కార్ తీరు బయటి ప్రపంచానికి అర్థమయ్యేలా భారీ ర్వాలీ నిర్వహిస్తామని ప్రజలు లేఖలో హెచ్చరించారు. గుజరాత్‌లో ఇలాంటి సరైన తాగునీరు లేని నియోజకవర్గాలు, గ్రామాలు చాలానే ఉన్నాయి. వడ్గావ్ ప్రజల స్పూర్తితో మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా నరేంద్రమోడీకి లేఖలు రాసేందుకు రెడీ అవుతున్నారు.