ఒకప్పుడు ప్రముఖ జర్నలిస్టు, ఇప్పుడు రోడ్డు పక్క సమోసాలమ్ముకుంటున్నాడు

ఆఫ్ఘనిస్తాన్ ఎంత సంక్షోభంలో ఉందో తెలియజేసే సంఘటన ఇది. ఒకప్పుడు ఎంతో మంచిగా బతికినవాళ్ళు ఇప్పుడు రోడ్డు పాలైన కథలెన్నో అక్కడ. నిన్నటి దాకా ఓ ప్రముఖ జర్నలిస్టు, న్యూస్ యాంకర్ అయిన ఓ వ్యక్తి ఇప్పుడు రోడ్డు పక్కన సమోసాలు అమ్ముకుంటున్నాడు. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోకముందు మూసా మొహమ్మది ఆఫ్ఘన్ లో ఓ న్యూస్ టీవీ చానల్లో యాంకర్ గా పనిచేశాడు. అనేక ఏళ్ల పాటు మీడియా రంగంలో ప్రముఖ యాంకర్ గా, జర్నలిస్టుగా […]

Advertisement
Update:2022-06-17 01:36 IST

ఆఫ్ఘనిస్తాన్ ఎంత సంక్షోభంలో ఉందో తెలియజేసే సంఘటన ఇది. ఒకప్పుడు ఎంతో మంచిగా బతికినవాళ్ళు ఇప్పుడు రోడ్డు పాలైన కథలెన్నో అక్కడ. నిన్నటి దాకా ఓ ప్రముఖ జర్నలిస్టు, న్యూస్ యాంకర్ అయిన ఓ వ్యక్తి ఇప్పుడు రోడ్డు పక్కన సమోసాలు అమ్ముకుంటున్నాడు.

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోకముందు మూసా మొహమ్మది ఆఫ్ఘన్ లో ఓ న్యూస్ టీవీ చానల్లో యాంకర్ గా పనిచేశాడు. అనేక ఏళ్ల పాటు మీడియా రంగంలో ప్రముఖ యాంకర్ గా, జర్నలిస్టుగా గుర్తింపు అందుకున్నాడు.

తాలిబన్ల చేతిలోకి అధికారంరాగానే అనేక ఆఫ్ఘన్ టీవీ చానళ్లు మూతపడ్డాయి. వందల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డునపడ్డారు. అలాంటివారిలో మూసా మొహమ్మది కూడా ఉన్నాడు. అయితే, కుటుంబ పోషణ కోసం ఈ జర్నలిస్టు వీధుల్లో సమోసాలు అమ్ముకుంటున్నాడు. అతడి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

అతడి పరిస్థితిపై ఆఫ్ఘనిస్థాన్ జాతీయ రేడియో, టీవీ విభాగం డైరెక్టర్ అహ్మదుల్లా వాసిక్ స్పందించారు. ఆఫ్ఘన్ లో నిపుణుల అవసరం ఎందో ఉందని, మూసా మొహమ్మదికి తమ సంస్థలో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు.

కాగా, మొహమ్మది సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న విషయాన్ని మాజీ అధికారి కబీర్ హక్మల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కబీర్ హక్మల్ గతంలో హమీద్ కర్జాయ్ ప్రభుత్వంలో పనిచేశారు.

Tags:    
Advertisement

Similar News