నిరుద్యోగుల జీవితాలతో మోదీ ఆటలు -సికింద్రాబాద్ అల్లర్లపై కేటీఆర్ ట్వీట్

అగ్నిపథ్ పథకం పేరుతో సైన్యం నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు.. దేశవ్యాప్తంగా చిచ్చు పెట్టాయి. అటు బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఇటు తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. ఆందోళనకారులు రైళ్లను తగలబెట్టారు, పోలీస్ కాల్పుల్లో ఒకరు మృతిచెందారు. అయితే ఈ పాపమంతా ప్రధాని నరేంద్రమోదీదేనంటూ ట్విట్టర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సైనిక ఉద్యోగాలకోసం సిద్ధమవుతున్న నిరుద్యోగుల జీవితాలతో మోదీ ఆటలు ఆడుకుంటున్నారని మండిపడ్డారు. […]

Advertisement
Update:2022-06-17 06:22 IST

అగ్నిపథ్ పథకం పేరుతో సైన్యం నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు.. దేశవ్యాప్తంగా చిచ్చు పెట్టాయి. అటు బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఇటు తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. ఆందోళనకారులు రైళ్లను తగలబెట్టారు, పోలీస్ కాల్పుల్లో ఒకరు మృతిచెందారు. అయితే ఈ పాపమంతా ప్రధాని నరేంద్రమోదీదేనంటూ ట్విట్టర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సైనిక ఉద్యోగాలకోసం సిద్ధమవుతున్న నిరుద్యోగుల జీవితాలతో మోదీ ఆటలు ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

రైల్వే స్టేషన్లో ఆందోళన చేస్తున్న ఓ నిరుద్యోగి.. పోలీస్ ఉన్నతాధికారితో తన బాధను వ్యక్తం చేస్తున్న వీడియోని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ పోస్ట్ చేయగా దాన్ని కేటీఆర్ రీట్వీట్ చేశారు. నిరుద్యోగుల బాధ వినాలని చెప్పారు. ఇక కేటీఆర్ కూడా మోదీపై తనదైన శైలిలో చెణుకులు విసిరారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు కేంద్రానికి కనువిప్పు కావాలన్నారు. దేశంలో నిరుద్యోగిత ఏ స్థాయిలో ఉందో, నిరుద్యోగులు ఏ స్థాయిలో కడుపుమండి రోడ్లపైకి వచ్చారో గమనించాలన్నారు. భారత్ లో నిరుద్యోగ సమస్య తీవ్రతకు ఈ ఆందోళనలు అద్దం పడుతున్నాయని చెప్పారు కేటీఆర్.

వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ నుంచి నో ర్యాంక్ – నో పెన్షన్ వరకు..
గతంలో వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ అంటూ సైనిక ఉద్యోగులకు కేంద్రం తీవ్ర నష్టం చేసిందని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. అప్పట్లో సైనికులకు ఇచ్చే పెన్షన్లో కోత విధించేందుకు కేంద్రం.. వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ అనే విధానం తీసుకొచ్చిందని ఇప్పుడు ఏకంగా నో ర్యాంక్ – నో పెన్షన్ అంటూ అన్నీ ఎత్తివేసే ఎత్తుగడలో ఉన్నారని మండిపడ్డారు. గతంలో రైతు చట్టాలు తీసుకొచ్చి రైతుల జీవితాలతో ఆడుకున్నారని, ఇప్పుడు సైనికుల జీవితాలతో ఆడుకోవడం మొదలు పెట్టారని.. మోదీని విమర్శించారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News