టీ మానేయండి దేశాన్ని రక్షించండి… పాక్ విచిత్ర విజ్ఞప్తి

పొగలు కక్కే టీ అంటే ఇష్టపడనివాళ్ళెవరుంటారు ? హైదరాబాద్ లాంటి చోట్ల ప్రతి గల్లీలో ఒక ఇరానీ హోటల్ ఇరానీ చాయ్ ఘుమఘుమలతో, కిటకిటలాడే టీ ప్రియులతో అలరారుతుంటుంది. ఒక్క మనదేశంలోనే కాదు అనేక దేశాల్లో టి అంటే పడి చచ్చే వాళ్ళు ఎంతో మంది. అలాంటిది టీ మానేయమని లేదా తగ్గించమని ఓ దేశ ప్రభుత్వం చెప్పడం విచిత్రంగా లేదూ ! అవును విచిత్రమే కాదు తలతిక్క అని కూడా అంటున్నారు జనం. ఇలాంటి పనులు […]

Advertisement
Update:2022-06-16 06:46 IST

పొగలు కక్కే టీ అంటే ఇష్టపడనివాళ్ళెవరుంటారు ? హైదరాబాద్ లాంటి చోట్ల ప్రతి గల్లీలో ఒక ఇరానీ హోటల్ ఇరానీ చాయ్ ఘుమఘుమలతో, కిటకిటలాడే టీ ప్రియులతో అలరారుతుంటుంది. ఒక్క మనదేశంలోనే కాదు అనేక దేశాల్లో టి అంటే పడి చచ్చే వాళ్ళు ఎంతో మంది. అలాంటిది టీ మానేయమని లేదా తగ్గించమని ఓ దేశ ప్రభుత్వం చెప్పడం విచిత్రంగా లేదూ !

అవును విచిత్రమే కాదు తలతిక్క అని కూడా అంటున్నారు జనం. ఇలాంటి పనులు పాకిస్తాన్ చేస్తూ ఉంటుంది. దేశ ప్రజలు టీ తాగడాన్ని మానేయాలని లేదా తగ్గించాలని పాకిస్థాన్ ప్రణాళిక, అభివృద్ధి శాఖా మంత్రి అషాన్ ఇక్బాల్ విజ్ఞప్తి చేశారు. కారణమేంటో తెలుసా ?

పాకిస్తాన్ లో వేగంగా విదేశీ మారకద్రవ్య నిల్వలు క్షీణిస్తున్నాయి. టి వినియోగాన్ని తగ్గించుకుంటే మారకద్రవ్య నిల్వలను కాపాడుకోవచ్చని ప్రభుత్వ అభిప్రాయం.

ప్రపంచంలోనే టీని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన పాకిస్థాన్ దానిని దిగుమతి చేసుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి అంటున్నారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ 83.88 బిలియన్ డాలర్ల (USD 400 మిలియన్లు) విలువైన టీని వినియోగించిందట. అందుకనే ప్రభుత్వం టీని తగ్గించమంటొందని ది న్యూస్ ఇంటర్నేషనల్ వార్తాపత్రిక తెలిపింది. .

ఇస్లామాబాద్‌లో మంత్రి అషాన్ ఇక్బాల్ విలేకరులతో మాట్లాడుతూ “మేము అప్పులు చేసి టీని దిగుమతి చేసుకుంటున్నందున టీ వినియోగాన్ని 1-2 కప్పులు తగ్గించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.” అన్నారు.

పాక్ లో ప్రతి సంవత్సరం టీ వినియోగం పెరిగిపోతోందట. 2020-21 కన్నా 2021-22లో 13 బిలియన్ డాలర్ల విలువచేసే టీ పొడి అధికంగా దిగుమతి జరిగిందని ప్రభుత్వ నివేదిక చెబుతోంది.

అయితే ప్రభుత్వ సూచనను పాకిస్తాన్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయంపై విమర్షలు ప్రారంభించారు.

టీ మానేయమని చెప్పడం కన్నా ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకుంటే మంచిదని, మంత్రులు, ఎంపీలు, అధికారులు తమ స్వంత విలాసాల కోసం చేస్తున్న‌ ఖర్చును తగ్గించండి అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా
మీరెన్ని చెప్పినా నేను టీ తాగడం ఆపలేను, తగ్గించలేను సారీ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

అయితే కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ శ్రీలంక ఆర్థిక పరిస్థితిలా తయారవుతుందని ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News