ఇక విమాన ప్ర‌యాణీకుల‌కు చుక్క‌లే!

దేశ‌ప్ర‌జ‌లు ఇప్ప‌టికే ద‌ర‌ల భారంతో కుంగిపోతున్నారు. సామాన్యుల ప‌రిస్థితి పెరిగిన ద‌ర‌ల‌తో మ‌రింత ద‌య‌నీయంగా మారింది. ఇక సంప‌న్న వ‌ర్గాల‌కూ ముఖ్యంగా విమాన ప్ర‌యాణీకుల‌కు ద‌ర‌ల షాకు త‌గ‌ల‌నుంది. విమాన యాన సంస్థ‌లు త్వ‌ర‌లో చార్జీల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించాయి. కొన్ని నెల‌లుగా అంత‌ర్జాతీయ మార్కెట్లో ముడి చ‌మురు ధ‌ర‌లు 110 డాల‌ర్ల‌కు మించిపోతుండ‌డంతో న‌ష్ట‌పోతున్నామ‌ని ఎయిర్ లైన్స్ సంస్థ‌లు వాపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే స్పైస్ జెట్ విమాన యాన సంస్థ త్వ‌ర‌లో చార్జీల పెంపు పై సంకేతాలు […]

Advertisement
Update:2022-06-16 11:47 IST

దేశ‌ప్ర‌జ‌లు ఇప్ప‌టికే ద‌ర‌ల భారంతో కుంగిపోతున్నారు. సామాన్యుల ప‌రిస్థితి పెరిగిన ద‌ర‌ల‌తో మ‌రింత ద‌య‌నీయంగా మారింది. ఇక సంప‌న్న వ‌ర్గాల‌కూ ముఖ్యంగా విమాన ప్ర‌యాణీకుల‌కు ద‌ర‌ల షాకు త‌గ‌ల‌నుంది. విమాన యాన సంస్థ‌లు త్వ‌ర‌లో చార్జీల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించాయి. కొన్ని నెల‌లుగా అంత‌ర్జాతీయ మార్కెట్లో ముడి చ‌మురు ధ‌ర‌లు 110 డాల‌ర్ల‌కు మించిపోతుండ‌డంతో న‌ష్ట‌పోతున్నామ‌ని ఎయిర్ లైన్స్ సంస్థ‌లు వాపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే స్పైస్ జెట్ విమాన యాన సంస్థ త్వ‌ర‌లో చార్జీల పెంపు పై సంకేతాలు ఇచ్చింది.

ఒకవైపు చమురు ధరలు పెరగడం, మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ క్షీణించడం వ‌ల్ల చార్జీలు పెంచ‌క త‌ప్పేట్లు లేద‌ని తెలిపింది. దేశీయ చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. డాలర్ తో రూపాయి మార‌కం విలువ క్షీణించడం వల్ల దిగుమతుల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కనుక ఈ ప్రభావం వినియోగదారులపై మరింత పడనుందని, ముఖ్యంగా రూపాయి విలువ క్షీణత ప్ర‌భావం తమపై ఎక్కువగా ఉందని స్పైస్ సెట్ చైర్మన్ అజయ్ సింగ్ అన్నారు. త్వరలోనే విమాన టికెట్ల ధరలను పెంచక త‌ప్ప‌ద‌ని ఆయ‌న చెప్పారు. కనీసం 10-15 శాతం వరకు పెరగొచ్చని పేర్కొన్నారు. 2021 జూన్ నుంచి ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర 120 శాతానికి పైనే పెరిగినట్టు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా, ఏటీఎఫ్ ధరను 16.3 శాతం పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గురువారం ప్రకటించాయి. ఇక పెరిగే చార్జీల‌తో విమాన ప్ర‌యాణీకులకు చుక్క‌లు క‌న‌బ‌డ‌నున్నాయి.

Tags:    
Advertisement

Similar News