మాకు ఈ భార్యలు వద్దంటూ పూజలు చేసిన భర్తలు
పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. చిన్న చిన్న గొడవలు, ఎప్పుడో ఒకసారి వస్తే పర్వాలేదు. కానీ నిత్యం గొడవలు పడుతుంటే ఆ సంసారం ముందుకు సాగడం కష్టమే. పెళ్లి చేసుకొని పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిన తర్వాత ఎందరో అమ్మాయిలు గృహహింస బారిన పడుతున్నారు. దీంతో వారి కోసం ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకొని వచ్చింది. మహిళలకు రక్షణగా ఈ చట్టాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో భార్యల నుంచి వేధింపులు […]
పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. చిన్న చిన్న గొడవలు, ఎప్పుడో ఒకసారి వస్తే పర్వాలేదు. కానీ నిత్యం గొడవలు పడుతుంటే ఆ సంసారం ముందుకు సాగడం కష్టమే. పెళ్లి చేసుకొని పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిన తర్వాత ఎందరో అమ్మాయిలు గృహహింస బారిన పడుతున్నారు. దీంతో వారి కోసం ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకొని వచ్చింది. మహిళలకు రక్షణగా ఈ చట్టాలు ఉన్నాయి.
అయితే ఇటీవల కాలంలో భార్యల నుంచి వేధింపులు వస్తున్నాయని ఎంతో మంది భర్తలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. భార్య నుంచి రక్షణ కావాలని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో భార్యబాధితుల సంఘాలు కూడా వెలిశాయి. భర్తలను హింసించే భార్యల నుంచి రక్షించడానికి ఈ సంస్థలు తమ వంతు సాయం చేస్తుంటాయి.
తాజాగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఒక వింత సంఘటన జరిగింది. భార్యబాధితుల సంఘానికి చెందిన సభ్యులు ‘ఈ భార్యలు వద్దు’ అంటూ సోమవారం సామూహికంగా పూజలు చేశారు. సాధారణంగా వట సావిత్రి పౌర్ణమి రోజు మహిళలు పూజలు చేస్తుంటారు. తమకు ఏడేడు జన్మలకు ఈ భర్తే కావాలంటూ ఆ పూజలు చేస్తారు. అదే రోజు భార్యబాధితుల సంఘం సభ్యులు ఈ భార్యలు మాకు వద్దే వద్దంటూ పూజలు చేయడం ఆసక్తికరంగా మారింది.
భార్యల టార్చర్ భరించలేకే సంఘాలు పెట్టుకున్నామని, అంతే కాకుండా వాళ్లు మాకు ఇకపై వద్దంటూ పూజలు కూడా చేస్తున్నామని.. ఈ బాధల నుంచి విముక్తి కలగాలని కోరుకుంటున్నామని వాళ్లు చెప్పడం విశేషం. కాగా, ఈ పూజలు చేస్తుండగా అక్కడ ఆలయంలో ఉన్న మహిళలు ఆసక్తిగా చూడటం గమనార్హం. ఇలా కూడా పూజలు చేస్తారా అని పలువురు చర్చించుకున్నారు.