స్కిట్ వ్యవహారంలో బండికి నోటీసులు.. రాణి రుద్రమ, దరువు ఎల్లన్న అరెస్ట్..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాగోలు పరిధి బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ‘అమరుల యాదిలో’ సభ నిర్వహించారు. ఆ సభలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కించపరుస్తూ ఒక స్కిట్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసు విషయంలో ఇప్పటికే బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాతా ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఇప్పుడు అదే కేసులో బీజేపీ నేతలు రాణి రుద్రమ, దరువు […]

Advertisement
Update:2022-06-14 12:59 IST

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాగోలు పరిధి బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ‘అమరుల యాదిలో’ సభ నిర్వహించారు. ఆ సభలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కించపరుస్తూ ఒక స్కిట్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసు విషయంలో ఇప్పటికే బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాతా ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఇప్పుడు అదే కేసులో బీజేపీ నేతలు రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను అరెస్ట్ చేశారు. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కేసీఆర్ సాగిస్తున్న నిరంకుశ పాల‌న చూసి.. తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నామా అని రాష్ట్ర ప్ర‌జ‌లు బాధపడుతున్నారని ఆ స్కిట్ లో నటీనటులు ప్రదర్శన ఇచ్చారు. కేసీఆర్ ఫొటోతో కూడిన మాస్క్ ధరించిన నటుడిపై సెటైర్లు వేశారు. ఆ తర్వాత ఆ వీడియోని వి-6 ఛానెల్ లో ప్రసారం చేశారు. సోషల్ మీడియాలో కూడా దాన్ని సర్క్యులేట్ చేశారు. అయితే వ్యంగ్యం పాళ్లు బాగా ఎక్కువ కావడంతో టీఆర్ఎస్ నాయకులు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి ఈ వ్యవహారంపై హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఆ కార్యక్రమ నిర్వాహకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ, దరువు ఎల్లన్నపై ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాక్ష్యాధారాలను సేకరించారు, విచారణ చేపట్టారు. ముందు జిట్టా బాలకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను కూడా అరెస్ట్ చేశారు. బండి సంజయ్ కి నోటీసులిచ్చారు. ఇటీవల కాలంలో తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా నడుస్తోంది. అనేక సందర్భాల్లో బీజేపీ నేతలు కావాలనే కించపరిచే మాటలు మాట్లాడుతూ హీట్ పెంచుతున్నారు. ఈ క్రమంలో వారిపై టీఆర్ఎస్ నేతలు కేసులు పెడుతున్నారు. తాజాగా బండి సంజయ్ వ్యవహారంలో కూడా ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నది. కావాలనే కేసీఆర్, పథకాలను కించ పరుస్తూ స్కిట్ చేశారని భావిస్తున్నది.

త్వరలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న సమయంలో బండి సంజయ్‌కు పోలీసుల నోటీసులు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నది. బీజేపీ మరి ఈ నోటీసులు విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News