అత్యాచారాల్లో అగ్రస్థానం బీజేపీ పాలిత రాష్ట్రాలదే..
ఇటీవల గ్యాంగ్ రేప్ ఘటనతో ఒక్కసారిగా హైదరాబాద్ వార్తల్లోకెక్కింది. బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు సమస్యను పక్కనపెట్టి, రాజకీయ స్వలాభం కోసం ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల లెక్క తీస్తే.. ఆడబిడ్డలకు తెలంగాణ సురక్షిత ప్రాంతం అని గణాంకాలు చెబుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలే పాపాల పుట్టలని నివేదికలు బట్టబయలు చేస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) లెక్కల ప్రకారం 2020లో భారత్ […]
ఇటీవల గ్యాంగ్ రేప్ ఘటనతో ఒక్కసారిగా హైదరాబాద్ వార్తల్లోకెక్కింది. బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు సమస్యను పక్కనపెట్టి, రాజకీయ స్వలాభం కోసం ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల లెక్క తీస్తే.. ఆడబిడ్డలకు తెలంగాణ సురక్షిత ప్రాంతం అని గణాంకాలు చెబుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలే పాపాల పుట్టలని నివేదికలు బట్టబయలు చేస్తున్నాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) లెక్కల ప్రకారం 2020లో భారత్ లో 28,046 అత్యాచార ఘటనలు జరిగాయి. అంటే రోజుకి సగటున 77 రేప్ లు జరిగినట్టు రికార్డులున్నాయి. ఇక ఆడవారిపై జరిగిన దాడులు, ఇతరత్రా ఘటనలన్నీ పరిగణలోకి తీసుకుంటే.. మహిళలను టార్గెట్ చేసుకుని జరిగిన నేరాలు 3,71,503. దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఈ గణాంకాలు అంతర్జాతీయ సమాజంలో బీజేపీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా మారాయి.
ఇక రాష్ట్రాలవారీగా లెక్క తీస్తే.. అభివృద్ధిలో దూసుకెళ్తోంది అని బీజేపీ చెప్పుకుంటున్న ఉత్తర ప్రదేశ్, నేరాల్లో కూడా టాప్ ప్లేస్ లో ఉంది. 2020లో యూపీలో జరిగిన అత్యాచార ఘటనల సంఖ్య 2,769. బీజేపీ పాలిత యూపీ రేప్ కేస్ ల నమోదులో దేశంలోనే నెంబర్-2 గా నిలిచింది. మహిళలపై అఘాయిత్యాలు జరిగే టాప్-10 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే అత్యథికం.
హర్యానాలో 1373మంది బాధితులు ఉన్నారు. అక్కడి జనాభా ప్రకారం రాష్ట్రంలో అత్యాచారాల శాతం 10గా ఉంది. దేశంలో అత్యాచార బాధితుల్లో హర్యానా ర్యాంక్ 4. అసోం-5, హిమాచల్ ప్రదేశ్-6, ఉత్తరాఖండ్-8, గోవా-11 స్థానాల్లో ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం. అంటే హైదరాబాద్ అత్యాచార ఘటనను రాజకీయం చేస్తూ.. టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న బీజేపీ.. జాతీయ గణాంకాలను మాత్రం ఎక్కడా ప్రస్తావించడంలేదు. ఆ లెక్కలు తీస్తే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆడవారికి అస్సలు రక్షణ లేదనే విషయం తేలిపోతుంది. ఇక బీజేపీ ఆరోపణలకు పూర్తి వ్యతిరేకంగా తెలంగాణ గణాంకాలు కనపడుతున్నాయి. తెలంగాణలో రేప్ కేసుల రేటు 4.1 గా ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన అత్యాచార ఘటనల లెక్క తీస్తే తెలంగాణ స్థానం 18గా ఉంది. పూర్తిగా ఇక్కడ అత్యాచారాలు జరగడంలేదని చెప్పలేం కానీ.. బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే తెలంగాణ మెరుగైన స్థానంలో ఉంది. శాంతి భద్రతలను కాపాడటంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది.