నూపుర్ శర్మకు మద్దతుగా రంగంలోకి దిగుతున్న‌ బజరంగ్ దళ్

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతుగా బజరంగ్ దళ్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీ విశ్వహిందూ పరిషద్‌ కూడా ఇందుకు తామూ సహకరిస్తామని ప్రకటించింది. బజరంగ్ దళ్ నేతలు, కార్యకర్తలు, సభ్యులు గురువారం నాడు దేశవ్యాప్త ఆందోళనలు చేస్తారని, హస్తినలోని అనేక దేవాలయాల్లో ఆ రోజున సామూహిక హనుమాన్ చాలీసా పఠనాలు జరుగుతాయని వీహెచ్ పీ నేతలు వెల్లడించారు. ఈ నెల 10 న దేశంలోని అనేకా రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనలకు […]

Advertisement
Update:2022-06-14 11:53 IST

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతుగా బజరంగ్ దళ్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీ విశ్వహిందూ పరిషద్‌ కూడా ఇందుకు తామూ సహకరిస్తామని ప్రకటించింది. బజరంగ్ దళ్ నేతలు, కార్యకర్తలు, సభ్యులు గురువారం నాడు దేశవ్యాప్త ఆందోళనలు చేస్తారని, హస్తినలోని అనేక దేవాలయాల్లో ఆ రోజున సామూహిక హనుమాన్ చాలీసా పఠనాలు జరుగుతాయని వీహెచ్ పీ నేతలు వెల్లడించారు.

ఈ నెల 10 న దేశంలోని అనేకా రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనలకు నిరసనగా తామీ ఆందోళన చేపట్టనున్నామని వారు చెప్పారు. ‘ఈ భారత దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా మంటగలపడానికి యత్నిస్తున్నారు. పథకం ప్రకారం ఎన్నో కుట్రలు చేస్తున్నారు. నూపుర్ శర్మకు అనుకూలంగా ఏర్పాటు చేసిన పోస్టర్లను ఢిల్లీ పోలీసులు చించివేశారు.., అనేకమందిని అరెస్టు చేశారు.. కానీ ఈసారి హిందుత్వ నినాదాన్ని హైలైట్ చేసేందుకు బజరంగ్ దళ్ నేతలు ఉద్యమించనున్నారు’ అని విశ్వహిందూ పరిషద్ నేతలు ఆవేశంగా వ్యాఖ్యానించారు. మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేశంలోని అనేక చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని, ఇస్లామిక్ జిహాదీ ఫండమెంటలిస్టుల తీవ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని వారు అన్నారు. వీటిని ఖండిస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు గురువారం దేశవ్యాప్తంగా జిల్లా ప్రధాన కార్యాలయాల ముందు ధర్నా చేస్తారని, ఆరోజున రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి మెమోరాండం సమర్పిస్తారని వారు స్పష్టం చేశారు.

ఇక ఢిల్లీలోని దేవాలయాల్లో ఆ రోజున సామూహిక హనుమాన్ చాలీసా పఠనాలు జరుగుతాయని, వీటితో గుడులన్నీ వెల్లువెత్తుతాయని పేర్కొన్నారు. ఈ నెల 10 న అనేక రాష్ట్రాల్లోని మసీదుల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లిములు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నూపుర్ శర్మకు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీ, యూపీ లోని ప్రయాగ్ రాజ్ లోను, మరికొన్ని చోట్ల అల్లర్లు, ఘర్షణలు జరిగాయి. నిరసనకారుల రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఢిల్లీలోని జామా మసీదు, జమ్మూ తదితర చోట్ల అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.

పథకం ప్రకారం జరిగిన కుట్ర

ఈ హింసాత్మక ఘటనలన్నీ పథకం ప్రకారం జరిగిన కుట్ర ఫలితమేనని ఢిల్లీ విశ్వహిందూ పరిషద్ చీఫ్ కపిల్ ఖన్నా ఓ స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. ఇండియాను ప్రపంచ దేశాల్లో చిన్నచూపు చూపే ప్రయత్నమే ఇదని, పైగా నూపుర్ శర్మహత్యకు అక్రమ ఫత్వా జారీ చేశారని ఆయన నిప్పులు చెరిగారు. ఇలాంటి అకృత్యాలను హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని, వీటిని సహించబోదని ఆయన అన్నారు. హిందూత్వకు జరుగుతున్న హాని గురించి అన్ని ఆలయాల ధర్మకర్తలు, పూజారులు భక్తులకు తెలియజేయాలని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని చేరవేయాలని కపిల్ ఖన్నా కోరారు.

Tags:    
Advertisement

Similar News