మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు మా బాస్ కు సంబంధం లేదు

సుబ్బి పెళ్ళి ఎంకి చావుకు రావడమంటే ఇదే. ఆయన పేరు వల్ల ప్రముఖ వ్యాపార దిగ్గజం నవీన్ జిందాల్ ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి బహిష్కరించబడ్డ నవీన్ కుమార్ జిందాల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ యజమాని నవీన్ జిందాల్ పేర్లు ఒకేలాగా ఉండటంతో కొన్ని మీడియా సంస్థలు ఆయన ఫోటోల బదులు ఈయన ఫోటోలను పోస్ట్ చేస్తున్నాయట. పైగా ఈయనపేరే రాస్తున్నాయట. ఈ నేపథ్యంలో […]

Advertisement
Update:2022-06-13 03:15 IST

సుబ్బి పెళ్ళి ఎంకి చావుకు రావడమంటే ఇదే. ఆయన పేరు వల్ల ప్రముఖ వ్యాపార దిగ్గజం నవీన్ జిందాల్ ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి బహిష్కరించబడ్డ నవీన్ కుమార్ జిందాల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ యజమాని నవీన్ జిందాల్ పేర్లు ఒకేలాగా ఉండటంతో కొన్ని మీడియా సంస్థలు ఆయన ఫోటోల బదులు ఈయన ఫోటోలను పోస్ట్ చేస్తున్నాయట. పైగా ఈయనపేరే రాస్తున్నాయట.

ఈ నేపథ్యంలో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో తమ బాస్ కు ఎలాంటి సంబంధం లేదని దయచేసి మీడియా గమనించాలని జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ ప్రకటించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత , ఢిల్లీ ఐటీ సెల్ హెడ్ నవీన్ కుమార్ జిందాల్ పేరును నవీన్ జిందాల్ గా పేర్కొనడం తమ బాస్ ఫోటోలను పోస్ట్ చేయడం సరైంది కాదని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాయాలంటే వెనకా ముందూ ఆలోచించవు. ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ పేరు, ఫొటోలు పొరపాటున వాడుతున్నారు. కంటెంట్ ట్యాగ్ లు, హ్యాష్‌ట్యాగ్‌లను కూడా నవీన్ జిందాల్ అని టైప్ చేస్తున్నారు. మీడియా చేస్తున్న ఈ పనుల వల్ల జిందాల్ స్టీల్స్ అండ్ పవర్ చైర్మన్ ఇబ్బంది పడుతున్నారని ఆసంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

మీడియాలో నవీన్ కుమార్ జిందాల్ బదులు.. నవీన్ జిందాల్ ఫోటోలు వాడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాలను కూడా ట్యాగ్ చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు మీడియా దూరంగా ఉండాలని సూచించింది.

నవీన్‌ కుమార్‌ జిందాల్‌తో, తమ‌ బాస్‌ నవీన్‌ జిందాల్ కు ఎలాంటి సంబంధం లేదని జిందాల్‌ స్టీల్స్‌ స్పష్టం చేసింది. మీడియా దీన్ని అర్థం చేసుకుని సహకరిస్తుందని ఆశిస్తున్నాం.

Tags:    
Advertisement

Similar News