వైసీపీ బానిసలు.. టీడీపీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఏపీ పోలీసులు..
పోలీసులు వైసీపీ నేతల బానిసలు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారని.. అలాంటి వ్యాఖ్యలతో తమ మనోభావాలను దెబ్బతీయొద్దని అన్నారు గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ. అన్ని రాజకీయ పార్టీలు తమకు సమానమే అని ఆయన స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర 150 మందితో సెక్యూరిటీ ఇస్తున్నామని.. మరి వాళ్ళను టీడీపీ బానిసలు అనాలా అని ప్రశ్నించారు. పోలీసులపై అనవసరమైన కామెంట్స్ చేసి తమ మనోభావాలు దెబ్బతీయొద్దన్నారు త్రివిక్రమ వర్మ. కంతేరులో వ్యక్తిగత గొడవ.. […]
పోలీసులు వైసీపీ నేతల బానిసలు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారని.. అలాంటి వ్యాఖ్యలతో తమ మనోభావాలను దెబ్బతీయొద్దని అన్నారు గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ. అన్ని రాజకీయ పార్టీలు తమకు సమానమే అని ఆయన స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర 150 మందితో సెక్యూరిటీ ఇస్తున్నామని.. మరి వాళ్ళను టీడీపీ బానిసలు అనాలా అని ప్రశ్నించారు. పోలీసులపై అనవసరమైన కామెంట్స్ చేసి తమ మనోభావాలు దెబ్బతీయొద్దన్నారు త్రివిక్రమ వర్మ.
కంతేరులో వ్యక్తిగత గొడవ..
గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరుకి చెందిన వెంకాయమ్మ అనే మహిళ ఇటీవల సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు మహానాడులో పెద్దపీట వేశారు టీడీపీ నాయకులు, మరోసారి వెంకాయమ్మతో ప్రభుత్వాన్ని తిట్టించారు. ఆ తర్వాత వెంకాయమ్మ తనకు పథకాలు ఆపేశారని, వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా తన కొడుకుపై దాడి జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత దాడి అని వివరణ ఇచ్చారు పోలీసులు. దీన్ని రాజకీయం చేయడం తగదని చెప్పారు. చలో కంతేరు అంటూ టీడీపీ చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేశారు.
కంతేరులో సునీత, వంశీ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగిందని.. దీనిపై ఇద్దరూ ఫిర్యాదు చేశారని చెప్పారు డీఐజీ త్రివిక్రమ వర్మ. రెండు కేసుల్లోనూ ఇరు వర్గాలను అరెస్టు చేశామని, దర్యాప్తు గొనసాగుతోందని చెప్పారు. దర్యాప్తు జరుగుతున్నప్పుడు శాంతిభద్రతల సమస్య తలెత్తేలా గ్రామంపైకి దండయాత్రలా టీడీపీ నేతలు వెళ్తామని చెప్పడం కరెక్ట్ కాదని అన్నారాయన. వ్యక్తిగత గొడవలను రాజకీయ గొడవలుగా సృష్టించొద్దని హితవు పలితారు.
వెంకాయమ్మ ఇంటి వద్ద పికెట్..
అటు వెంకాయమ్మ ఇంటి వద్ద కూడా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ఎవరినీ అటువైపు రానీయడంలేదు. టీడీపీ నేతల్ని, ఇతర జిల్లాలనుంచి వచ్చేవారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో మాజీ మంత్రులు దేవినేని ఉమ, నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, తంగిరాల సౌమ్య, టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర తదితరులను గృహనిర్బంధం చేశారు. కంతేరు ఘటన పూర్తిగా వ్యక్తిగత గొడవ అని క్లారిటీ ఇస్తున్నారు గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. ఈ గొడవకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజీ కూడా ఉందని చెప్పారాయన.