తమిళిసై సూపర్ ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారు…మాజీ సీఎం ఆగ్రహం
తమిళిసై సౌందరరాజన్ సూపర్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి డమ్మీ అయిపోయారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయాన్ని నిన్న దర్శించుకున్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో హత్యలు, చోరీలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తిమిళిసై బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని, పుదుచ్చేరిని ముఖ్యమంత్రి కాకుండా ఆమే పాలిస్తున్నారని నారాయణ స్వామి అన్నారు. దేశంలో బీజేపీ పాలన దేశాన్ని […]
తమిళిసై సౌందరరాజన్ సూపర్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి డమ్మీ అయిపోయారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయాన్ని నిన్న దర్శించుకున్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో హత్యలు, చోరీలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తిమిళిసై బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని, పుదుచ్చేరిని ముఖ్యమంత్రి కాకుండా ఆమే పాలిస్తున్నారని నారాయణ స్వామి అన్నారు. దేశంలో బీజేపీ పాలన దేశాన్ని అధోగతి పాలు చేసిందని దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రభుత్వ సంస్థలను కేంద్రం ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా నీట్ ను రద్దు చేయకపోవడం వల్ల 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నారాయణ స్వామి. ఈ ఎనిమిదేళ్లలో బీజేపీ చేసింది ఏమీ లేదని, ప్రతిపక్షాలన్నీ ఏకమైతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఈ దేశాన్ని కాపాడవచ్చని ఆయన అన్నారు.