కేసీఆరా? మమతా? విపక్షం లీడర్‌ ఎవరో..?

రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. దేశ రాజకీయాలను వేడెక్కించాయి. బీజేపీ వ్యూహం ఇంకా బయటపడలేదు. కానీ ప్రతిపక్షాల్లో మాత్రం కదలిక మొదలైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిర్ణయించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ పోరు కాస్తా ఇప్పుడు దీదీ వర్సెస్‌ కేసీఆర్‌గా మారుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని చర్చించేందుకు 22 పార్టీలను మమత ఆహ్వానించారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌తో పాటు అన్ని పార్టీలకు ఇన్విటేషన్‌ పంపారు. ఈనెల 15న ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఈ సమావేశానికి కేసీఆర్‌ హాజరవుతారా? లేదా? అనే […]

Advertisement
Update:2022-06-12 02:02 IST

రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. దేశ రాజకీయాలను వేడెక్కించాయి. బీజేపీ వ్యూహం ఇంకా బయటపడలేదు. కానీ ప్రతిపక్షాల్లో మాత్రం కదలిక మొదలైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిర్ణయించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ పోరు కాస్తా ఇప్పుడు దీదీ వర్సెస్‌ కేసీఆర్‌గా మారుతోంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని చర్చించేందుకు 22 పార్టీలను మమత ఆహ్వానించారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌తో పాటు అన్ని పార్టీలకు ఇన్విటేషన్‌ పంపారు. ఈనెల 15న ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఈ సమావేశానికి కేసీఆర్‌ హాజరవుతారా? లేదా? అనే చర్చ నడుస్తోంది. టీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం ఈ సమావేశంపై పెదవి విప్పడం లేదు. ఇంకా మూడు రోజుల టైమ్‌ ఉంది. కేసీఆర్‌ ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. వేచి చూద్దాం అనే ధోరణిలో ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సొంత జాతీయ పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారట. భారతీయ రాష్ట్రీయ సమితి పేరుతో కొత్త పార్టీ లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఈ వారంలోనే ఆయన ప్రకటన చేస్తారని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇదే టైమ్‌లో మమత కూడా జాతీయ రాజకీయాల్లో కీరోల్‌ పోషించాలని అనుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఇద్దరి మధ్య పొలిటికల్‌ ఫైట్‌ విపక్షాల్లో ఎలాంటి చీలిక తీసుకొస్తుందో అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రశాంత్‌ కిషోర్‌.. కేసీఆర్, మమతకు ఇద్దరికి రాజకీయ వ్యూహకర్త. ఈయన ఏమైనా ఈ ఇద్దరిని కలుపుతారా? లేక ఇద్దరు వేర్వేరుగా పోటీ చేస్తారా? కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు ఎవరికి మద్దతు పలుకుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News