వల్లభనేని వంశీ ఓ విలన్..! మళ్లీ తెరపైకి గన్నవరం పంచాయితీ..
గన్నవరం వైసీపీలో అంతర్గత విభేదాలు ఇంకా చల్లారినట్టు లేవు. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీయే వైసీపీ తరపున పోటీ చేస్తారంటూ ఆమధ్య సజ్జల రామకృష్ణారెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. పరోక్షంగా అధిష్టానం యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి కాస్త తగ్గమని సూచించింది. అయితే యార్లగడ్డ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. వంశీపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అభ్యర్థి ఎవరో అధిష్టానమే తేలుస్తుంది.. గత ఎన్నికల్లో తాను ఓ విలన్ తో పోటీ చేశానంటూ వంశీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు […]
గన్నవరం వైసీపీలో అంతర్గత విభేదాలు ఇంకా చల్లారినట్టు లేవు. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీయే వైసీపీ తరపున పోటీ చేస్తారంటూ ఆమధ్య సజ్జల రామకృష్ణారెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. పరోక్షంగా అధిష్టానం యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి కాస్త తగ్గమని సూచించింది. అయితే యార్లగడ్డ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. వంశీపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.
అభ్యర్థి ఎవరో అధిష్టానమే తేలుస్తుంది..
గత ఎన్నికల్లో తాను ఓ విలన్ తో పోటీ చేశానంటూ వంశీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు యార్లగడ్డ వెంకట్రావు. వంశీని పార్టీలోకి తీసుకొచ్చేటప్పుడే తాను వ్యతిరేకించానని, ప్రతి సారీ అధిష్టానంతో పోరాటం చేయలేనని అన్నారు. వ్యక్తిగత పనులమీద 6 నెలలు తాను అమెరికాలో ఉన్నానని, ఆ సమయంలో తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ తనకు డీసీసీ చైర్మన్ పదవి ఇచ్చారని, దాన్ని సమర్థంగా నిర్వహించానని, తనకు ఏ బాధ్యత అప్పగించినా దాన్ని సమర్థంగా పూర్తి చేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసేది ఎవరో అధిష్టానం నిర్ణయిస్తుందని, ఊహాగానాలు అనవసరమని చెప్పారు యార్లగడ్డ.
మట్టి తవ్వకాలపై సెటైర్లు..
గన్నవరం నియోజకవర్గంలో మట్టి తవ్వకాలపై ఇటీవల వంశీ, యార్లగడ్డ వర్గాల మధ్య విభేదాలు వచ్చాయి. ఒకరిపై ఒకరు కలెక్టర్ కు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడు మట్టి తవ్వకాల విషయంలో కూడా యార్లగడ్డ సెటైర్లు పేల్చారు. తాను నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్నప్పుడు ఒక తట్టమట్టి తవ్వలేదని, కనీసం ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. పరోక్షంగా వల్లభనేని వర్గం మట్టి తవ్వకాలలో అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. మరోవైపు టీడీపీ నాయకులతో మంతనాలు జరుపుతున్నారన్న వార్తల్ని కూడా ఆయన ఖండించారు. సీఎం జగన్ తనను పార్టీలోకి తీసుకొచ్చారని, ఆయన వెంటే తాను నడుస్తానని అన్నారు. సజ్జల క్లారిటీ ఇచ్చాక గన్నవరం హీట్ కాస్త తగ్గింది అనుకున్న సమయంలో మరోసారి యార్లగడ్డ వెంకట్రావు ఇలా బహిరంగంగా వంశీపై కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది.