వైసీపీ జూమ్‌ చొరబాట్లపై ఫిర్యాదు

జూమ్‌ మీటింగ్‌లో పదో తరగతి విద్యార్థులను ప్రభుత్వంపై రెచ్చగొట్టేందుకు నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు.. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంట్రీలో ఒక్కసారిగా సైడ్‌ ట్రాక్ పట్టేశాయి. ఊహించని విధంగా వైసీపీ నేతలు జూమ్‌లోకి రావడం, మీడియా కూడా అసలు విషయాన్ని వదిలేసి ఈ విషయంపైకి ఫోకస్ మళ్లించడంతో టీడీపీ ఆగ్రహంగా ఉంది. ఇలాగైతే తమ జూమ్‌ మీటింగ్‌లు జరిగేది ఎలా అన్న ఆందోళన టీడీపీలో ఉంది. అది కూడా తమ పార్టీ తరపున గెలిచిన వల్లభనేని […]

Advertisement
Update:2022-06-10 06:23 IST

జూమ్‌ మీటింగ్‌లో పదో తరగతి విద్యార్థులను ప్రభుత్వంపై రెచ్చగొట్టేందుకు నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు.. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంట్రీలో ఒక్కసారిగా సైడ్‌ ట్రాక్ పట్టేశాయి. ఊహించని విధంగా వైసీపీ నేతలు జూమ్‌లోకి రావడం, మీడియా కూడా అసలు విషయాన్ని వదిలేసి ఈ విషయంపైకి ఫోకస్ మళ్లించడంతో టీడీపీ ఆగ్రహంగా ఉంది. ఇలాగైతే తమ జూమ్‌ మీటింగ్‌లు జరిగేది ఎలా అన్న ఆందోళన టీడీపీలో ఉంది.

అది కూడా తమ పార్టీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ.. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచే లోకేష్‌ జూమ్‌ మీటింగ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పుడు ఏకంగా వర్లరామయ్య ఈ అంశంపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. రెండు పార్టీల మధ్య గొడవలు సృష్టించేందుకే కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితరులు జూమ్‌లోకి చొరబడ్డారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు.

తప్పుడు పేర్లతో జూమ్‌లోకి ప్రవేశించడమే కాకుండా నారా లోకేష్‌ను, చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని వర్ల చెబుతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవేందర్ రెడ్డి, వైసీపీ కార్పొరేటర్‌గా పోటీ చేసిన కొత్తపల్లి రజనిలపై వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. తప్పుడు మార్గాల్లో జూమ్‌లోకి చొరబడిన వారిపై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News