పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించారు. కొంతకాలంగా అస్వస్ధతగా ఉన్న ఆయన దుబాయ్ లోని ఆసుపత్రిలో కన్ను మూశాడు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. నిజానికి ఆయన గత మే 30 వ తేదీనే మరణించినట్టు వదంతులు వచ్చాయి. అయితే అది నిజం కాదని, ఆయన ఆరోగ్యం దిగజారుతోందని ఆ తరువాత వార్తలు అందాయి. అప్పటినుంచి ముషారఫ్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతూ వచ్చారు. 2016 నుంచి ఆయన దుబాయ్ లో ప్రవాసంలో ఉంటున్నారు. […]
Advertisement
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించారు. కొంతకాలంగా అస్వస్ధతగా ఉన్న ఆయన దుబాయ్ లోని ఆసుపత్రిలో కన్ను మూశాడు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. నిజానికి ఆయన గత మే 30 వ తేదీనే మరణించినట్టు వదంతులు వచ్చాయి. అయితే అది నిజం కాదని, ఆయన ఆరోగ్యం దిగజారుతోందని ఆ తరువాత వార్తలు అందాయి. అప్పటినుంచి ముషారఫ్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతూ వచ్చారు. 2016 నుంచి ఆయన దుబాయ్ లో ప్రవాసంలో ఉంటున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేశారన్న ఆరోపణలపై 2007 లో ముషారఫ్ పై దేశద్రోహం కేసు నమోదైంది. అయితే 2014 లో ఆయనను పాక్ ప్రభుత్వం అభిశంసించింది. ఈ అభిశంసన కింద ఏ వ్యక్తికైనా మరణశిక్ష. లేదా యావజ్జీవ శిక్ష విధిస్తారు. ఈ ఏడాది జనవరి లోనే ముషారఫ్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన నడవలేకపోతున్నారని, నిలబడలేకపోతున్నారని లోగడ వార్తలు వచ్చాయి. తనపై దాఖలైన దేశద్రోహం కేసుపై విచారణను వాయిదా వేయాలన్న ముషారఫ్ అభ్యర్థనను ఓ ప్రత్యేక కోర్టు ఆమోదించిందని.. దాన్ని జూన్ 12 వరకు వాయిదా వేసిందని అప్పట్లో వెల్లడైంది. తన క్లయింటు తిరిగి పాకిస్థాన్ కు రావాలనుకుంటున్నారని, కానీ ఆయన ఆరోగ్యం బాగులేకపోవడంతో దుబాయ్ లోనే ఉండదలిచారని ముషారఫ్ తరఫు లాయర్ సఫ్దర్ ఇటీవల తెలిపారు. 2001 నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్ .. బెనజీర్ భుట్టో హత్య కేసులో పరారీలో ఉన్న నేరస్థుడిగా ముద్ర పడ్డారు. 1999 లో ఆయన పాక్ ప్రభుత్వ పగ్గాలను చేబట్టారు. తన అభిశంసను తప్పించుకునేందుకు ముషారఫ్ 2008 లో రాజీనామా చేశారు.
దాదాపు తన జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు కూడా ముషారఫ్ ఇండియాపట్ల తన ద్వేషాన్ని వెళ్లగక్కారు. లోగడ జమ్మూ కాశ్మీర్ లో పుల్వామా దాడి జరిగినప్పుడు 40 మంది సీఆర్ఫీ ఎఫ్ జవాన్లు మరణించిన విషయాన్నీ ఆయన దృష్టికి తేగా.. పాకిస్తాన్ ఓ అణుబాంబును ఇండియాపై వేస్తే ఇండియా.. పాక్ పై 20 అణుబాంబులు వేసి దేశాన్ని ఫినిష్ చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. మొదట మనం 50 బాంబులు వేయాలని దాంతో వారు కనీసం 20 బాంబులతోనైనా మనపై దాడి చేయలేరని అన్నారు. పైగా ఇండియా-ఇజ్రాయెల్ మధ్య మైత్రీ బంధాన్ని తెంచివేయాల్సి ఉందని, పాకిస్థాన్ ఈ పనిని సులభంగా చేయగలదని అన్నారు. 1999 లో ఈయన ఆధ్వర్యంలోనే సైనిక కుట్ర జరిగి పాక్ లో నాటి అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ పదవీచ్యుతుడయ్యారు. అయితే తొమ్మిదేళ్లు అధ్యక్ష పదవిని వెలగబెట్టాక మళ్ళీ ఆ దేశంలో జరిగిన కుట్రలో ముషారఫ్ గద్దె దిగి నవాజ్ షరీఫ్ తిరిగి అధికార పగ్గాలను చేజిక్కించుకున్నారు.
Advertisement