అన్ని రాష్ట్రాల వారికి పనికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ -కేటీఆర్

దేశంలోని ఏ రాష్ట్రమైనా స్థానికులకు, లేదా దగ్గర్లో ఉన్న ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని, కానీ తెలంగాణ మాత్రం దేశంలోని అన్ని రాష్ట్రాల వారికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు మంత్రి కేటీఆర్. అన్ని రాష్ట్రాల వారికి పనికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కీర్తిగడించిందని అన్నారు. భారత దేశానికి యువతరమే అతిపెద్ద శక్తి అని పేర్కొన్నారు కేటీఆర్. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిరుద్యోగ యువతకోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌ ను ప్రారంభించిన […]

Advertisement
Update:2022-06-10 11:53 IST

దేశంలోని ఏ రాష్ట్రమైనా స్థానికులకు, లేదా దగ్గర్లో ఉన్న ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని, కానీ తెలంగాణ మాత్రం దేశంలోని అన్ని రాష్ట్రాల వారికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు మంత్రి కేటీఆర్. అన్ని రాష్ట్రాల వారికి పనికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కీర్తిగడించిందని అన్నారు. భారత దేశానికి యువతరమే అతిపెద్ద శక్తి అని పేర్కొన్నారు కేటీఆర్. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిరుద్యోగ యువతకోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌ ను ప్రారంభించిన ఆయన.. కష్టపడి చదివితే కొలువు సాధించడం పెద్ద కష్టమేం కాదన్నారు.

ఉద్యమ నినాదానికి అనుగుణంగా..

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని, ఉద్యమ నినాదానికి అనుగుణంగా నీళ్లు, నిధులు, నియామకాలు చేపడుతున్నామని అన్నారు. నీళ్ల విషయంలో దేశంలో 75 ఏళ్లలో జరగని పురోగతిని రాష్ట్రంలో సాధించామన్నారు కేటీఆర్. రూ.45 వేల కోట్లు ఖర్చుచేసి ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం తెలంగాణలో ఉందన్నారు. లార్జెస్ట్‌ లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అని గూగుల్‌ లో సెర్చ్ చేస్తే.. కాళేశ్వరం అని కనపడుతుందని చెప్పారు. 90 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అని ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికి మంచి నీరు పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ దేనని స్పష్టం చేశారు కేటీఆర్.

ఇక నియామకాల విషయానికొస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు కేటీఆర్. కొత్తగా 90 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టామన్నారు. 95 శాతం స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు వచ్చేలా సీఎం కేసీఆర్‌ కృషి చేశారని, ప్రైవేటు రంగంలో తెలంగాణలో 19 వేల పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు.

Tags:    
Advertisement

Similar News