అరేబియా అడ్డంకితో మారిన రుతు రాగం..

ప్ర‌తి ఏటా జూన్‌లో తెలుగు రాష్ట్రాల‌ను ప‌లుక‌రించే తొల‌క‌రి జ‌ల్లులు ఈసారి కాస్త ఆల‌స్యం కానున్నాయి. య‌ధావిధిగా నైరుతి రుతు ప‌వ‌నాల గాలులు రాయ‌ల‌సీమ జిల్లాల‌తోపాటు, నెల్లూరు జిల్లాలో కూడా విస్త‌రించినా, వ‌ర్షం మాత్రం లేదు. రుతుప‌వ‌నాల స‌మ‌యంలో చాలాసార్లు గాలుల కంటే వ‌ర్షాలు ఎక్కువ సార్లు ముందుగా వ‌స్తాయి. ఒక్కోసారి రెండూ ఒకేసారి వ‌స్తాయి. ఒక్కోసారి మాత్ర‌మే అటు ఇటు అవుతుంటాయి. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా తెలుగు రాష్ట్రాల‌లో వ‌ర్షాలు రుతు ప‌వ‌నాల కంటే ముందుగానే […]

Advertisement
Update:2022-06-10 10:27 IST

ప్ర‌తి ఏటా జూన్‌లో తెలుగు రాష్ట్రాల‌ను ప‌లుక‌రించే తొల‌క‌రి జ‌ల్లులు ఈసారి కాస్త ఆల‌స్యం కానున్నాయి. య‌ధావిధిగా నైరుతి రుతు ప‌వ‌నాల గాలులు రాయ‌ల‌సీమ జిల్లాల‌తోపాటు, నెల్లూరు జిల్లాలో కూడా విస్త‌రించినా, వ‌ర్షం మాత్రం లేదు. రుతుప‌వ‌నాల స‌మ‌యంలో చాలాసార్లు గాలుల కంటే వ‌ర్షాలు ఎక్కువ సార్లు ముందుగా వ‌స్తాయి. ఒక్కోసారి రెండూ ఒకేసారి వ‌స్తాయి. ఒక్కోసారి మాత్ర‌మే అటు ఇటు అవుతుంటాయి. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా తెలుగు రాష్ట్రాల‌లో వ‌ర్షాలు రుతు ప‌వ‌నాల కంటే ముందుగానే వ‌చ్చాయి. ఈసారి మాత్రం అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డ్డ అల్ప పీడ‌నం వ‌ల్ల రుతుప‌వ‌నాలు స‌కాలంలో వ‌చ్చినా చినుకు జాడ మాత్రం లేదు. కాస్త ఆల‌స్య‌మైనా ఈసారి మంచి వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. జూన్ మ‌ధ్య‌లో వ‌ర్షాలు ఊపందుకుంటాయ‌ని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News