టీ20:భారత్ పై 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం

భారత్ పై దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గతరాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత జట్టు నిర్దేశించిన 212 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. డుసెన్, డేవిడ్ మిల్లర్ భారత బౌలర్లను చీల్చి చెండాడి జట్టుకు ఘన విజయాన్ని అందించి పెట్టారు. డుసెన్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా […]

Advertisement
Update:2022-06-10 01:33 IST

భారత్ పై దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గతరాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత జట్టు నిర్దేశించిన 212 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

డుసెన్, డేవిడ్ మిల్లర్ భారత బౌలర్లను చీల్చి చెండాడి జట్టుకు ఘన విజయాన్ని అందించి పెట్టారు. డుసెన్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 75 పరుగులు చేయగా, మిల్లర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేశాడు. అంతకుముందు ప్రిటోరియస్ పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఆడింది 13 బంతులే అయినా ఫోర్, 4 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. క్వింటన్ డి కాక్ 22, కెప్టెన్ తెంబా బవుమా 10 పరుగులు చేశారు. మిల్లర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్‌ తలా ఓ వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. గైక్వాడ్ 23, శ్రేయాస్ అయ్యర్ 36, కెప్టెన్ పంత్ 29, హార్దిక్ పాండ్యా 31 పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో మహారాజ్, నార్జ్, పార్నెల్, ప్రిటోరియస్‌ తలా ఓ వికెట్ తీసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News