లోకేష్ జూమ్‌లోకి తాను ఎంటరవడంపై కొడాలి హాట్ కామెంట్స్
పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించేందుకే నారా లోకేష్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. పిల్లలతో లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి తాను వెళ్లడంపై కొడాలి స్పందించారు. నారా లోకేష్‌ను కొన్ని ప్రశ్నలు అడగాలనే తాను జూమ్‌లోకి వెళ్లానని..కానీ తనను చూడగానే కట్ చేసుకుని పారిపోయారన్నారు. ఫెయిల్ అయిన వారికి ధైర్యం చెప్పాల్సిందిపోయి.. ఇక మీ పని అయిపోయింది, ఆత్మహత్యలే దిక్కు అన్నట్టుగా లోకేష్ ప్రేరిస్తున్నారన్నారు. […]
పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించేందుకే నారా లోకేష్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. పిల్లలతో లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి తాను వెళ్లడంపై కొడాలి స్పందించారు. నారా లోకేష్‌ను కొన్ని ప్రశ్నలు అడగాలనే తాను జూమ్‌లోకి వెళ్లానని..కానీ తనను చూడగానే కట్ చేసుకుని పారిపోయారన్నారు.
ఫెయిల్ అయిన వారికి ధైర్యం చెప్పాల్సిందిపోయి.. ఇక మీ పని అయిపోయింది, ఆత్మహత్యలే దిక్కు అన్నట్టుగా లోకేష్ ప్రేరిస్తున్నారన్నారు. కరోనా కారణంగా సరిగా క్లాస్ జరక్కపోవడం, ఆన్‌లైన్ క్లాస్‌ల్లో చదువుకునేందుకు సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు లేకపోవడంతోనే పేద విద్యార్థులు నష్టపోయారన్నారు. ఈ ఇబ్బంది వస్తుందనే స్కూళ్లను త్వరగా తెరిచేందుకు గతంలో ప్రభుత్వం ప్రయత్నిస్తే..ఇదే లోకేష్ స్కూళ్లు తెరవడానికి వీల్లేదంటూ అడ్డుపడ్డారని గుర్తు చేశారు.
పిల్లలను భయపెడుతున్న లోకేష్‌కు సమాధానం చెప్పాలనే.. తన మేనల్లుడి ఐడీ ద్వారా తాను జూమ్‌లోకి వెళ్లానని.. అది ఫేక్ ఐడీ కాదని వివరించారు. తనను నేరుగా చర్చకు రావాలంటున్న లోకేష్…ఎందుకు పిల్లలతో నేరుగా మీటింగ్ పెట్టలేదని ప్రశ్నించారు. కేవలం అనుకూలమైన వారితో మీటింగ్ కోసమే జూమ్ పెట్టారా అని నిలదీశారు.
ఫెయిల్ అయిన వారికి 10 మార్కులు కలిపి పాస్ చేయాలన్న పవన్ కల్యాణ్ ప్రతిపాదనను కొడాలి తప్పుపట్టారు. పది మార్కులు కలపడం ఎందుకు ? స్కూళ్లు మూసేసి, టీచర్లను తీసేసి, పిల్లలను ఇళ్ల దగ్గరే పెట్టి ప్రతి ఏటా ఒక్కోక్లాస్ పెంచుకుంటూ పోతే సరిపోదా అని వ్యంగ్యంగా మాట్లాడారు. చదువు నేర్పకుండా పిల్లలను పాస్ చేస్తూ వెళ్తే చివరకు వారు కూడా పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లా తయారవుతారని కొడాలి వ్యాఖ్యానించారు.
చదువుతో సంబంధంలేకుండా అందరినీ పాస్ చేస్తూ వెళ్తే పది, ఇంటర్ వరకు బాగానే ఉంటుందని… ఆ తర్వాత ఆ పిల్లలు ఏం చేయగలరని కొడాలి ప్రశ్నించారు. కాబట్టి ఫెయిల్ అయిన విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదని.. ఈ నెలలో బాగా చదువుకుని సప్లిమెంటరీలో పాస్ కావాలని సూచించారు. విద్యతో నాణ్యత ఉండాలన్న ఉద్దేశంతోనే తాము నిజాయితీగా పరీక్షలు నిర్వహించి, వచ్చిన ఫలితాలను విడుదల చేశామన్నారు.